Chanakya Niti: చాణక్య నీతిలో ఇవి ఎందుకు ప్రధానమో తెలుసా మీకు..?

Chanakya Niti: చాణక్యనీతిలో వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనల గురించి చాలా క్లుప్తంగా వివరించబడ్డాయి. ఆయన సూచించిన మార్గాల్లో నడవడం వల్ల వ్యక్తి ఉన్నత స్థానంలో జీవించగలుగుతాడని చాణక్యనీతి పేర్కొంది.

Last Updated : Oct 3, 2022, 11:41 AM IST
  • చాణక్య నీతిలో వ్యక్తి జీవితంలో ఉన్న స్థాయిలకు..
  • ఎదిగేందుకు చాలా రకాల సూత్రలను పేర్కొన్నాడు.
  • మంచి సంఘటన గురించి తెలిపారు.
 Chanakya Niti: చాణక్య నీతిలో ఇవి ఎందుకు ప్రధానమో తెలుసా మీకు..?

Chanakya Niti: చాణక్యుని పేరు తెలియని వారు ఎవరు ఉండరు. అతను ఎన్నో ఆవిష్కరణ ఘట్టాలను పూరించారు. అంతేకాకుండా ఆయన అనుసరించిన కొన్ని సూత్రాలను నీతుల రూపంలో ప్రజలకు అందజేశారు. వీటిని ఇప్పుడు మనం చాణక్య నీతి సూత్రాలు అని పిలుస్తున్నారు. చాణక్య నీతిలో మనిషి జీవితంలో కొనసాగే సంతోషాలు దుఃఖాల గురించి ఎంతో చక్కగా వివరించారు. ముఖ్యంగా వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనల గురించి ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో క్లుప్తంగా పేర్కొన్నాడు. కొన్ని సంఘటనలు జీవితాలను మార్చితే మరికొన్ని మరికొన్ని సంఘటనలు జీవితంలో సమస్యలు తెచ్చిపెడతాయని అతను తెలిపాడు.

అంతేకాకుండా చాణక్యుడు రచించిన మార్గంలో ఆయన సూత్రాలను పాటించి ముందడుగు వేస్తే విజయాలు తప్పకుండా సాధించగలుగుతారని.. ఆయన రచించిన నీతిలో కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. చాణక్య శాస్త్రంలో పేర్కొన్న కొన్ని సూత్రాలు మీ జీవితంలో జరిగితే అవి మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతాయని శాస్త్రం తెలుపుతోంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

>>ఆచార్య చాణక్యుడు వివరించిన దాని ప్రకారం.. ఒక వ్యక్తి జీవితంలో దురదృష్టం అదృష్టంగా మారేకొద్ది పలు మార్పులు వస్తాయని.. దీనివల్ల మనిషి సంతోషం పొందుతాడని ఆయన పేర్కొన్నాడు. 

జీవిత భాగస్వామిని కోల్పోవడం:
వ్యక్తి జీవితంలో తనకు తోడుగా ఉండే భాగస్వామిని కోల్పోతే.. భవిష్యత్తులో వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చాణక్య నీతి చెబుతోంది. అయితే వృద్ధాప్యంలో భార్యను కోల్పోవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు అని పేర్కొంది. ఈ సంఘటన కూడా వ్యక్తి జీవితం పై ప్రభావం చూపుతుంది. 

బ్యాంకు నిలువలు:
వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయిలకు ఎదగాలంటే అది కేవలం డబ్బు వల్లనే సాధ్యమవుతుంది. ప్రస్తుతం డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి డబ్బువల్లానే ఎలాంటి పనులైనా సాధ్యమవుతాయి.. కాబట్టి మూలధనం ఎల్లప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే క్రమంగా మీ ఆర్థిక సంపద కరిగిపోతే అది చెడు సంకేతంగా భావించవచ్చని చాణక్య నీతి చెబుతోంది. కాబట్టి అవసరమైనప్పుడే డబ్బును ఖర్చు పెట్టాలని శాస్త్రం పేర్కొంది.

అద్దెకు ఉండడం:
చాలామంది వారికి సొంతిల్లు లేక ఇతరుల ఇంట్లో అద్దెకు ఉంటారు. ఇలా జీవించడం కూడా ఒక మంచి సంఘటనగా చెప్పొచ్చని చాణక్య నీతి పేర్కొంది ఇలా ఉండడం వల్ల కోరికలు అదుపులో ఉంటాయని.. కేవలం తనకు సాధ్యమైన కోరికలు తీర్చుకోగలుగుతాడని శాస్త్రం చెబుతోంది. దీనివల్ల డబ్బు వృధా కాదని మనిషి సమాజంలో ఎదుగుతాడని శాస్త్రం పేర్కొంది.

Also Read: Bathukamma 2022 Wishes: తెలంగాణ ప్రజలందరికీ పూల పండగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

Also Read: Bathukamma 2022 Wishes: తెలంగాణ ప్రజలందరికీ పూల పండగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News