Bouncy Hair: ఉల్లిపాయరసం జుట్టుకు ఇలా పట్టిస్తే కుదుళ్ల నుంచి బలంగా.. నడుము వరకు పెరుగుతుంది..

Bouncy Hair With Onion Juice: ఉల్లిపాయ రసాన్ని మనం హెయిర్ కేర్ రొటీన్లు ఉపయోగిస్తాము. ఇది కుదుళ్ల నుంచి జుట్టును బలపరుస్తుంది. ఉల్లిపాయలు రసం జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 14, 2024, 08:15 AM IST
Bouncy Hair: ఉల్లిపాయరసం జుట్టుకు ఇలా పట్టిస్తే కుదుళ్ల నుంచి బలంగా.. నడుము వరకు పెరుగుతుంది..

Bouncy Hair With Onion Juice: ఉల్లిపాయ రసాన్ని మనం హెయిర్ కేర్ రొటీన్లు ఉపయోగిస్తాము. ఇది కుదుళ్ల నుంచి జుట్టును బలపరుస్తుంది. ఉల్లిపాయలు రసం జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. జుట్టు మందంగా పెరగడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. హెయిర్ ఫాల్ సమస్య రాకుండా జుట్టు పెరగడానికి ప్రేరేపిస్తుంది. అంతేకాదు కొత్త సెల్‌ ఉత్పత్తికి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఉల్లిపాయ రసంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు కుదుళ్ల నుంచి మెరిసేలా చేస్తాయి. ఇంట్లోనే ఉల్లిరసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ఉల్లిపాయ, కలబంద..
ఒక సగం ఉల్లిపాయ తీసుకొని దాని రసం తీసి పెట్టుకోవాలి. అందులోనే కలబంద జెల్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ రసం ఒక ఒక గిన్నెలో వేసుకొని ఫ్రిజ్లో నిల్వ కూడా చేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్కుని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయడం వల్ల జుట్టు బలపడుతుంది ఆరిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఉల్లిపాయ రసం గుడ్డు..
ఒక గుడ్డు తీసుకొని అందులో తెల్లటి బాగానే ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి. ఇందులో ఉల్లిపాయ రసం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది జుట్టుని అంతటికీ అప్లై చేసి అరగంట అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మామూలు షాంపుతో హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఉల్లి రసం తేనె..
ఉల్లిపాయ రసంలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోవాలి ఇది కుదుళ్లకు మొత్తానికి అప్లై చేసే కాసేపు అలాగే వదిలేయాలి హెయిర్ మాస్కు 15 నిమిషాల తర్వాత షాంపూ, కండిషనర్ కూడా పెట్టి తలస్నానం చేయాలి. దీంతో ఎఫెక్టీవ్‌ రిజల్ట్స్‌ పొందుతారు.

ఇదీ చదవండి: లవంగం ఇలా తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు.. అది ఎలానో తెలుసా?

కొబ్బరి నూనె..
ఈ రెమెడీ ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది. ఒక తాజా ఉల్లిపాయను రసం ఒక బౌల్లో వేసుకొని అందులో కొబ్బరి నూనె కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకుదుళ్ల నుంచి చివర్ల వరకు పెట్టి బాగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత మామూలు నీటితో స్నానం చేసుకోవాలి. ఈ మిశ్రమం రాత్రి తలంతటికీ అప్లై చేసి ఉదయం కూడా తలస్నానం చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: ఈ ఒక్క కొరియన్ బెల్లీఫ్యాట్‌ డ్రింక్ తాగితే చాలు.. అదనపు కొవ్వు అమాంతం మాయమైపోతుంది..

ఆలివ్ ఆయిల్..
ఉల్లి రసము ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇది జుట్టు అంతటికీ పట్టి 20 నిమిషాలకు అలాగే వదిలేసి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఆలివ్ ఆయిల్ నిమ్మరసం ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా బౌన్సీగా ఆరోగ్యకరంగా కనిపిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News