Black Pepper For High BP: అధిక రక్తపోటు చాలా ప్రమాదకరం. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వెంటనే ఈ సమస్యను నియంత్రించడం వల్ల ప్రమాదం తప్పుతుంది. ఈ అధిక రక్తపోటు సమస్యను తగ్గించడానికి చాలా మంది మందులను వాడుతుంటారు. మందుల వల్ల కేవలం ఉపశమనం కలుగుతుంది. కానీ ఆరోగ్యనిపుణులు ప్రకారం మిరియాలు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.
మనం రోజు వాడే సుగంధ ద్రవ్యాలు పురాతన కాలం నుంచి ఔషధాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఈ సుగంధ ద్రవ్యాలు కీలకమైన వ్యాధుల నుంచి కాపాడుతాయి. నల్ల మిరియాలు రక్త విస్తరించడంలో సహాయపడుతుంది. సాధారణంగా నార్మల్ బి 120/80 ఉంటుందని మన అందరికి తెలుసు. అయితే 140/90 ఉంటే బ్లడ్ ప్రెజర్ క్రమంగా పెరుగుతోంది అంటే వైద్యులను కలవాల్సి ఉంటుంది. ఒకవేల మీరు బీపీని నియంత్ర చేయలేనప్పుడు హార్ట్ అటాక్, పక్షవాతం వంటి సమస్యలను బారిన పడాల్సి ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే నల్ల మిరియాలు తీసుకోవాల్సి ఉంటుంది.
మిరియాల వల్ల కలిగే లాభాలు:
మిరియాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులోని క్యాల్షియం, ఐరన్ , కెరోటిన్, థైమోన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీని తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుచుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
కీళ్ల నొప్పు, జలుబు, దగ్గు, కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా తగ్గించడంలో మేలు చేస్తుంది. అధిక రక్తపోటు వంటి సమస్యలను తొలగించడంలో మిరియాలు సహాయపడుతాయి.
కడుపులో గ్యాస్, డిప్రెషన్ వంటి సమస్యలను కూడా ఈ నల్ల మిరియాలు తొలగిస్తాయి. శరీరంలో చురుకుగా ఉండే సహాయపడుతుంది.
రక్తపోటు పెరిగినప్పుడు మిరియాల పొడిని తీసుకొని గ్లాస్ నీటిలో కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ , జీర్ణవ్యవస్థ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Also Read Barley Water: బార్లీ వాటర్ తాగడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా?
చెడు కొలెస్ట్రాల్ నియంత్రించడంలో నల్ల మిరియాలు ఎంతో మేలు చేస్తాయి. గుండె, ప్రేగు సంబంధిత వ్యాధులను కూడా తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.
మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా మిరియాలు మేలు చేస్తాయి. జలుబ, అజీర్ణం , ఆస్తమా వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
నల్ల మిరియాలను రెగ్యులర్‌గా వినియోగించడం వల్ల ఒత్తిడిని తొలగిస్తుంది.నల్ల మిరియాలు శరీరంలోని సెరోటోనిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter