2024 Bhogi Date: సంక్రాంతి పండగ అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది భోగి పండగ. ఈ పండగను హిందువులు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా జనవరి నెలలో జరుపుకునే ఈ పండగను తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరంలోని మొదటి పండగగా భావిస్తారు. ఈ పండగ తెలుగు వారి సాంస్కృతికి గొప్ప చిహ్నం. ఇలాంటి పండగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ భోగి పండగ ఉదయాన్నే భోగిమంటలతో ప్రారంభమై సాయంత్రం కోడిపందాల వరకు ముగుస్తుంది. ఈ పండగ గురించి చెప్పాలంటే మరెన్నో ఉన్నాయి.
ముఖ్యంగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ రోజునే కొత్త అల్లుడు అత్తవారింటికి వస్తాడు. దీంతో అల్లుని రాకతో అత్తవారిల్లంత ఓ రేంజ్ లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో అల్లునికి కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలను వండి పెడతారు. అంతేకాకుండా అల్లునికి కావాల్సిన మర్యాదలు కూడా చేస్తారు. ముఖ్యంగా ఈ పండగ ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం భోగి పండగ జనవరి 14 తేదీన వచ్చింది.
భోగి పండుగ గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు:
సంస్కృతం ప్రకారం.. భోగి అనే పదం 'భగ' అనే పదం నుంచి ఉద్భవించింది. అంతేకాకుండా ఈ పండగను దక్షిణాయనికి చివరి రోజుగా కూడా భావిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు. దక్షిణాయణంలో పడ్డ కష్టాలన్నీ తొలగిపోవాలని, భోగి మంటల ద్వారా అగ్ని దేవుడికి సమర్పిస్తారని పూర్వికులు తెలిపారు. దీనికి కారణంగా రాబోయే ఉత్తరాయన కాలంలో సుఖసంతోషాలు వర్ధిల్లుతాయని ప్రజలు నమ్మకం. ఈ భోగి పండుగ రోజున అందరూ ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేస్తారు. తర్వాత భోగి మంటలు వేసి అందులో ఆవు పేడతో చేసిన పిడకలు, ఇంట్లో ఉండే పాత సామాన్లను మంటల్లో వేస్తారు. ఇలా తగలబెట్టడం వల్ల మన మనసులో ఉన్న చెడు మొత్తం తొలగిపోయి, మంచి పెరుగుతుందని ప్రజల నమ్మకం.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
అంతేకాకుండా భోగి పండుగ రోజున ముత్తాయిదవులు బొమ్మల కొలువు చేస్తారు. ఈ సమయంలో ఆడపడుచులంతో చిన్న పిల్లల మీద రేగుపళ్లు పోయిస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లల తలపై ఉండే బ్రహ్మ రంధ్రం ప్రభావితమై జ్ఞానవంతులవుతారని పూర్వీకుల నుంచి వస్తున్న ఓ నమ్మకం.. అంతేకాకుండా ఈరోజు పల్లెల్లో ఉండే ప్రతి ఒక్కరు ముందుగా పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఒకరి ఇళ్లల్లోకి మరొకరు వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకుంటారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter