Betel Leaf: అతిగా తమలపాకులను తింటే అంతే సంగతి..

Betel Leaf: తమలపాకులను అతిగా తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ కింది సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2022, 04:12 PM IST
 Betel Leaf: అతిగా తమలపాకులను తింటే అంతే సంగతి..

Betel Leaf: తమలపాకులను భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ ఆకులతో చేసిన వంటకాలు ముఖ్వాస్ పాన్‌లను ఎక్కువగా భారతీయులు వివాహ వేడుకల్లో తింటూ ఉంటారు. తమలపాకుల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలకు ఇందులో లభిస్తాయి. అయితే చాలా మంది వీటిని బరువు తగ్గే క్రమంలో మధుమేహం చికిత్సలో విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. వీటిని అతిగా తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్ని పోషకాలున్నాయో హాని కలిగించే అన్ని మూలకాలే ఇందులో ఉంటాయి. కాబట్టి వీటిని అతిగా తినడం వల్ల చాలా రకాల దుష్ఫలితాలు కలగొచ్చు.

అయితే చాలా మంది పాన్‌లో పొగాకు కలుపుకుని విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. అయితే వీటిని అతిగా తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తమలపాకును తినడం వల్ల తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని అతిగా వినియోగించకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

బీపీని పెంచుతుంది:
పాన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.  దీని కారణంగా రక్తపోటు పెరిగే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. తమలపాకులను అతిగా తినడం వల్ల కూడా థైరాయిడ్ హార్మోన్ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

చిగుళ్లలో నొప్పి:
కొందరు తమలపాకును మౌత్ ఫ్రెష్‌నర్‌గా వినియోగిస్తారు. అయితే వీటిని విచ్చల విడిగా తింటే నోటి దుర్వాసన పోతుందని.. కానీ వీటిని అతిగా తినడం వల్ల చిగుళ్ల నొప్పి, నోటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తినకపోవడం చాలా మంచిది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని ప్రతి రోజు 2 తింటే మంచి ఫలితాలు పొందవచ్చి ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

 

Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈజ్ బ్యాక్.. ట్విట్టర్‌ అకౌంట్ రీ ఓపెన్.. కానీ..! 

Also Read: Trending Video: చిన్న స్పెల్లింగ్ మిస్టేక్.. కుక్కలా మారిపోయిన వ్యక్తి.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News