Baldness Problem: ఆధునిక జీవనశైలి తీసుకొస్తున్న ఎన్నో రకాల సమస్యల్లో ప్రధానమైంది జుట్టు రాలడం. ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా యుక్తవయస్సులో సైతం ఈ సమస్య వెంటాడుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి. హోమ్ రెమిడీస్‌తో ఎలా నియంత్రించవచ్చు..
మీ జుట్టు తరచూ రాలుతోందా..మీకు బట్టతల భయం వెంటాడుతోందా..అయితే ఇది మీ కోసమే. వాస్తవానికి జుట్టు రాలడానికి కారణాలు చాలా ఉంటాయంటున్నారు నిపుణులు. కానీ అన్నింటికంటే ప్రధానమైంది అస్థవ్యస్థమైన జీవనశైలి, ఒత్తిడికి లోనవడమే. శరీరంలో పోషక పదార్ధాల కొరత, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం కూడా జుట్టుపై ప్రభావం చూపిస్తుంటుంది. ఒకవేళ సకాలంలో జుట్టు రాలే సమస్యపై దృష్టి పెట్టకపోతే..రోజురోజుకూ పెరిగిపోతుందని అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు బట్టతల సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
జుట్టు రాలడానికి కారణాలు
ఒత్తిడి, శరీరంలో పోషక పదార్ధాల కొరత, ఎనీమియా, మొనోపాజ్, ప్రెగ్నెన్సీ, బర్త్ కంట్రోల్ మందుల వాడకం, థైరాయిడ్ సమస్యలు ప్రధానం. ఇవి కాకుండా వాడుతున్న నీరు, వాతావరణంలో దుమ్ము ధూళి కూడా ఇతర కారణాలు.
హెయిర్ ఫాల్ నియంత్రణకు హోమ్ రెమిడీస్
మెంతులు ఈ సమస్యకు అద్భుత పరిష్కారాన్నిస్తాయి. మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఆ మెంతుల్ని పేస్ట్‌గా చేసుకోవాలి. ఇందులో ఓ స్పూన్ నిమ్మరసం, కొబ్బరి నూనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు వేళ్లలో..సందుల్లో పట్టేలా బాగా రాసుకోవాలి. ఆరిపోయేంతవరకూ ఉంచుకుని..ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది.
ఉసిరి-అలోవెరాతో..
ఉసిరి పౌడర్‌లో శికాకాయ, కుంకుడుకాయ కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుని ఆరిపోయేంతవరకూ ఉంచుకోవాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కొన్నిరోజుల్లోనే తేడా గమనిస్తారు. ఇక అల్లోవెరా ఆకుల్ని కట్ చేసి..వాటి మధ్యలో ఉన్న జిగురును తీయాలి. దాన్ని జుట్టు వేళ్లలో రాసి మసాజ్ చేసుకోవాలి. ఓ అరగంట అలానే ఉంచుకుని ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే హెయిర్ ఫాల్ కచ్చితంగా తగ్గుతుందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
ఉల్లిరసం కూడా
ఉల్లిపాయల్ని బాగా నూరి రసం తీయాలి. ఆ రసాన్ని ఆయిల్ రాసినట్టే జుట్టు వేళ్లలో బాగా రాసుకోవాలి. దాదాపు ఓ అరగంట ఉంచుకుని ఆ తరువాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా..తలంతా ప్రశాంతంగా ఉన్నట్టుంటుంది.
Also read: Electricity Bill Reducing Tips: 24 గంటలు ఏసీ, కూలర్, ఫ్యాన్ వేసినా.. ఈ టిప్స్ తో సగానికంటే తక్కువ కరెంటు బిల్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.