Best Foods To Control Diabetes: శీతాకాలంలో వాతావరణంలో తేమ పరిమాణం అధికంగా పెరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రమాదం పెరుగుతుంది. ఇది వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్ మొదలైన ప్రమాదాన్ని పెంచే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
అయితే ఈ వాతావరణ మార్పులు తట్టుకోవడానికి పలు పలు ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం తీవ్ర తరం కాకుండా నియంత్రించుకోవచ్చు. అయితే ఈ వ్యాధి గ్రస్తులు ఎలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవచ్చొ మనం ఇప్పుడు తెలుసుకుందాం..
దాల్చిన చెక్క టీ:
మధుమేహంతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా టీని లేదా కాఫీని తీసుకుంటూ ఉంటారు. అయితే వీటికి బదులుగా దాల్చిన చెక్కతో చేసిన టీని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా దాల్చిన చెక్క టీని తీసుకోవాల్సి ఉంటుంది.
మొలకెత్తిన ధాన్యాలు:
మొలకెత్తిన తృణధాన్యాలను సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. వీటిని ప్రతి రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయి. కాబట్టి వీటిని తీసుకుంటే శరీరానికి 14 గ్రాముల కార్బోహైడ్రేట్లు అందుతాయి.
చిలగడదుంప:
ప్రస్తుతం మార్కెట్‌లో చిలగడదుంపతో చేసిన చిప్స్ ని తీసుకుంటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సి న కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇందులో ఉండే ఫోటోకెమికల్ బీటా కెరోటిన్ మూలకాలు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా మధుమేహం తగ్గుతుంది.
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడి గింజలను కూడా సూపర్ ఫుడ్ అని అంటారు. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్ సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి సహాయపడుతుంది, అంతేకాకుండా వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా లభిస్తాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
Also Read: Dewald Brevis: బేబీ ఏబీ తుఫాన్ ఇన్నింగ్స్.. 57 బంతుల్లోనే 162 పరుగులు
Also Read: Minister KTR: సీఎం జగన్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Diabetes Control: శీతాకాలంలో వీటిని ఆహారంగా తీసుకుంటే మధుమేహానికి చెక్.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..
దాల్చిన చెక్క టీ, మొలకెత్తిన ధాన్యాలు,
చిలగడదుంప, గుమ్మడికాయ గింజలు శీతాకాలంలో
తీసుకుంటే మధుమేహాన్ని 12 రోజుల్లో తగించుకోవచ్చు.