Benefits of Yoga: జీవనశైలి మారగడం వల్ల చాలా మందికి విశ్రాంతి తీసుకునే టైం దొరకడం లేదు. అంతేకాకుండా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది రక్తపోటు, షుగర్, ఆస్తమా, కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు. అయితే బిజీ లైఫ్ కారణంగా ఇలాంటి సమస్యలతో బాధపడితే తప్పకుండా యోగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజూ యోగా చేయడం వల్ల బాడీ ఫిట్‌గా కూడా మారుతుంది. అయితే బిజీ లైఫ్ రోజూ యోగా చేయని వారు క్రమం తప్పకుండా కూడా యోగా చేయోచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఆస్తమా సమస్య లేదా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా యోగాసనం ప్రభావవంతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రతి రోజూ ధనురాసనం చేయడం వల్ల ఉబ్బసం, మూత్రపిండాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కండరాలను దృఢంగా చేసేందుకు కూడా ప్రభావవంతంగా యోగా పని చేస్తుంది. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశనం పొందడానికి యోగాను ప్రతి రోజూ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యలకు చెక్ పెట్టండి:
ఉబ్బసం:
ఆధునిక జీవన శైలి కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తున్నాయి. ఇది మందులతో కాకుండా యోగాతో సులభంగా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉబ్బసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే తప్పకుండా ధనురాసనం చేస్తే సులభంగా ఈ సమస్యలు తగ్గుతాయి.
కిడ్నీ:
కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా రోజూ యోగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రోజూ యోగా చేయడం వల్ల కిడ్నీకి సంబంధించిన సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో వ్యర్థాలు కూడా శరీరం నుంచి బయటకు వస్తాయి. కాబట్టి తప్పకుండా యోగా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి:
ధనురాసనం ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ దీన్ని సాధన చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరం కూడా ఫిట్‌గా మారుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి నిపుణులను సంప్రదించండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే
Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook