Sprouted Peanuts Health Benefits: మొలకెత్తిన పల్లీలు తింటున్నారా..? అయితే తప్పకుండా ఇవి తెలుసుకోండి

Nutrition Tips With Sprouted Peanuts: ప్రతిరోజు మొలకెత్తిన గింజలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో కొన్ని ఆరోగ్యకరమైన గింజలను నీళ్లలో నానబెటి ఉదయం వాటిని తినడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. మొలకెత్తిన పల్లీలు తీసుకోవడం చాలా మంచిది. ప‌ల్లీల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇలా మరి కొన్ని  విషయాలను తెలుసుకుందాం  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 11:56 AM IST
Sprouted Peanuts Health Benefits: మొలకెత్తిన పల్లీలు తింటున్నారా..? అయితే తప్పకుండా ఇవి తెలుసుకోండి

Nutrition Tips With Sprouted Peanuts:  ప‌ల్లీలు.. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. వీటిని తరుచుగా మనం  కూర‌ల్లో లేదా ఉడికించి కూడా తీసుకుంటూ ఉంటాము. అయితే ప‌ల్లీల‌ను వేయించి, ఉడికించి తీసుకోవ‌డానికి బ‌దులుగా మొల‌కెత్తించి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని ఆరోగ్యప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు. మొల‌కెత్తిన ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మస్య‌లు త‌గ్గుతాయి. ఇలా ఎన్నో ప్రయోజలను పొందవచ్చు..అవి ఏంటి అనే అంశంపై ఇప్పుడు మనం  తెలుసుకుందాం

జుట్టు ఆరోగ్యంగా..

మొల‌కెత్తిన ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యం ఉంటుంది. జుట్టు పెరుగుద‌ల‌కు కావ‌ల్సిన పోష‌కాలు ప‌ల్లీల‌ల్లో స‌మృద్దిగా ఉంటాయి. జుట్లును వత్తుగా చేయడంలో కూడా సహాయపడుతుంది.

శరీరం బ‌లంగా త‌యార‌వుతుంది..

అల‌స‌ట‌, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. మొల‌కెత్తిన ప‌ల్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు.

అధిక బరువు సమస్య...

ఎక్కువ మందిని వేధిస్తోన్న సమస్య బరువు పెరగటం. మొలకెత్తిన పల్లీలు తినడం వల్ల బరువు పెరగకుండా కంట్రోల్‌ చేస్తుంది. ఉదయం కొన్ని మొలకెత్తిన పల్లీలు తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.

గుండెకు ఎంతో మేలు..

ప్రతిరోజు గుప్పెడు పల్లీలను తీసుకోవడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిచడంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. మొలకెత్తిన పల్లీలు తినడం ద్వారా గుండెపోటు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది.

 

Also Read: Tourist Places : స్వదేశంలోనే విదేశీ అనుభూతి ఇచ్చే టూరిస్ట్ ప్లేసెస్.. న్యూ ఇయర్ కి బెస్ట్ ప్లాన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News