Benefits Of Cloves Tea In Winter: భారతీయులు ఎక్కువగా వినియోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. వీటిని వినియోగించని ఆహార పదార్థాలు ఉండవు ఇవి ఆహారానికి రుచి అందించడమే కాకుండా శరీరానికి కూడా అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా శీతాకాలంలో ఈ లవంగాలతో తయారుచేసిన టీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. దీంతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్లు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా చలికాలంలో ఆహారాల్లో వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
చలికాలంలో లవంగాల వల్ల కలిగే లాభాలు:
జలుబు నుంచి ఉపశమనం:
శీతాకాలంలో చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలా మంది జలుబు దగ్గు వడ్డీ సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు లవంగాల టీని తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు గొంతు నొప్పి కఫం వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి:
కొంతమందిలో వాతావరణంలోని తేమ పరిమాణాలు తగ్గడం పెరగడం కారణంగా శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా జ్వరం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే చలికాలంలో తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా లవంగాలతో తయారుచేసిన టీని తాగాల్సి ఉంటుంది.
దగ్గు నుంచి ఉపశమనం:
శీతాకాలంలో చాలామందిని వేధించే సమస్యలను దగ్గు కూడా ఒకటి.. ఈ దగ్గు కారణంగా చాలామంది ఊపిరితిత్తుల సమస్యల బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరంలో కఫాన్ని తొలగించేందుకు కూడా సహాయపడతాయి.
జీర్ణక్రియ మెరుగు పడుతుంది:
కొంతమందిలో చలి కారణంగా సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో చాలామందిని వేధించే సమస్య జీర్ణ క్రియ మందగించడం. అయితే దీనికి కారణంగా చాలామందిలో మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తీసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter