Moongdal Health Benefits: సాధారణంగా ఎక్కువ శాతం మన ఇళ్లలో కందిపప్పుతో టమాటా పప్పు, సాంబర్ తయారు చేసుకుంటాం. ఇది అందరికీ ఇష్టమైన పప్పు. అయితే, పెసరపప్పు కూడా అప్పుడప్పుడు వండుకుంటాం. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. త్వరగా తయారు చేసుకోవచ్చు కూడా. అయితే, దీనిలోని పది ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతిరోజూ తింటారు అవేంటో తెలుసుకుందాం.
లీన్ ప్రొటీన్..
ప్రతిరోజూ మన ఆహారంలో ప్రొటీన్ ఉండాల్సిందే. ఇది కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. పెసరపప్పు మనకు రోజంతటికీ కావాల్సిన ప్రొటీన్స్ అందిస్తుంది. ఎందుంటే ఇది మొక్కల ఆధారిత ప్రొటీన్లకు పవర్‌హౌజ్..
క్యాలరీలు తక్కువ..
పెసరపప్పులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీనికి ఇతర ఏ ఆహార పదార్థాలు జోడించకుండా కూడా తీసుకోవచ్చు. దీంతో బరువు కూడా పెరగరు.
సెల్యూలోజ్..
పెసరపప్పులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహిస్తుంది. అంతేకాదు పేగు కదలికకు కూడా ప్రోత్సహిస్తుంది. పెసరపప్పు డైట్లో చేర్చుకుంటే మలబద్ధకం సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు.
పోషకాలు పుష్కలం..
పెసరపప్పులో ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ బీ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన రక్తసరఫరా, శక్తి ఉత్పాదకతకు కీలకం.
కార్డియాక్ హెల్త్..
పెసరపప్పులోని ఫైబర్, పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు బీపీ పెరగకుండా కాపాడతాయి. దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తక్కువవుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఇదీ చదవండి:చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయిందా? ఇలా చేయండి మైనంలా కరిగిపోతుంది..
బ్లడ్ షుగర్..
పెసరపప్పులో గ్లైసెమిక్ సూచి తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు పెసరపప్పును ఆహారంలో చేర్చుకోవాలి.
చర్మానికి మెరుగు..
పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా నివారిస్తాయి. అంతేకాదు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గిస్తాయి. మీ స్కిన్ ఆరోగ్యవంతంగా ఉండటానికి సహాయపడతాయి.
ఇదీ చదవండి:వాల్ నట్స్ నానబెట్టి ఎందుకు తినాలి? అసలైన కారణం ఇదే..
వెయిట్ లాస్..
పెసరపప్పులోని హై ప్రోటీన్, ఫైబర్ బరువు పెరగకుండా సహాయపడుతుంది. దీంతో వెంటనే ఆకలి వేయదు.కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
జీర్ణం..
పెసరపప్పులోని ఫైబర్ కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. కడుపులో గ్యాస్, అజీర్తి సమస్యలు రాకుండా మంచి బ్యాక్టిరియా పెరుగుదలకు ప్రోత్సహిసిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook