Monsoon Makeup Tips: వర్షాకాలంలో హ్యుమిడిటీ, చికాకు ఎక్కువగా ఉంటాయి. దాంతో మేకప్ త్వరగా వదిలించుకోవడంపైనే దృష్టి ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వర్షాకాలంలో సైతం హాయిగా మేకప్ ఉంచుకోవచ్చు..
వర్షాకాలంలో సహజంగానే ఉక్కపోత అధికంగా ఉంటుంది. మరోవైపు చిరాకు ఉంటుంది. దాంతో మేకప్ అవరమైనవారు చాలా అసహనంగా ఉంటారు. ఎప్పుడెప్పుడు మేకప్ తీసేయాలా అన్పిస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని సులభమైన చిట్కాలతో మేకప్ సమస్యను దూరం చేసుకోవచ్చు. వర్షాకాలంలో సైతం ఎక్కువ సేపు మేకప్ ఉంచుకోవచ్చు. వర్షాకాలంలో సహజంగా హ్యుమిడిటీ ఉంటుంది. ఎక్కువగా చెమట్లు పడుతుంటాయి. ఫలితంగా చర్మంపై మేకప్ త్వరగా పోతుంటుంది. కొన్ని సులభమైన చిట్కాలు, పద్ధతులు పాటిస్తే మేకప్ ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1. మేకప్ చేయడానికి ముందే మీ చర్మానికి ఐస్ రాయాలి. వర్షాకాలంలో ఎక్కువగా చికాకు, ఉక్కపోత ఉంటాయి. ఐస్ వల్ల ఉక్కపోత దూరమౌతుంది. దాంతోపాటు ఎక్కువ సేపు మేకప్ నిలుస్తుంది. ముఖంతో పాటు మెడ భాగమంతా ఐస్ రాయాలి.
2. వర్షాకాలంలో ప్రైమరీ వాడకం కూడా మంచి ప్రత్యామ్నాయం. ప్రైమరీ వాడటం వల్ల ఫౌండేషన్ ఎక్కువసేపుండటమే కాకుండా..ఎక్కువ చెమట కూడా పట్టకుండా ఉంటుంది.
3. వర్షాకాలంలో ఎక్కువ చెమట పట్టడం సహజమే. ఈ పరిస్థితుల్లో కాజల్ ఐలైనర్‌ను పెన్సిల్ రూపంలో వాడాలి. పెన్సిల్ ఐలైనర్ కొన్ని గంటల తరువాత దిగిపోతుంది. కానీ వర్షాకాలంలో లిక్విడ్ కాజల్ రాయడం వల్ల చెమట్లు పట్టినప్పుడు మొత్తం పాడైపోతుంది. అందుకే పెన్సిల్ ఐలైనర్ మంచిది.
4. లిప్‌స్టిక్ కోసం లిక్విడ్ మ్యాట్ లిప్‌స్టిక్ వినియోగించవచ్చు. ఇది మీ పెదవులను సుందరంగా ఉంచడమే కాకుండా..ఆకర్షణీయంగా కన్పిస్తారు. ఈ లిప్‌స్టిక్ ఎక్కువ సేపు నిలబడుతుంది.
Also read: White Hair on Face: ముఖంపై తెల్ల వెంట్రుకల నుంచి విముక్తి ఎలా, ఈ చిట్కాలు పాటిస్తే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Monsoon Makeup Tips: వర్షాకాలంలో మేకప్ ఎక్కువసేపు నిలవాలంటే ఏం చేయాలి