Hair Fall Control: జుట్టు రాలడం ఆగడం లేదా..అరటి పండు మిశ్రమంతో జుట్టు సమస్యలకు 5 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..

Banana For Hair Fall Control: వాన కాలంలో జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బనానాతో తయారు చేసిన హెయిర్ మాస్క్‌ని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 4, 2023, 06:02 PM IST
Hair Fall Control: జుట్టు రాలడం ఆగడం లేదా..అరటి పండు మిశ్రమంతో జుట్టు సమస్యలకు 5 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..

Banana For Hair Fall Control: వర్షాకాలం కారణంగా వాతావరణం పెరిగి జుట్టు రాలడం, జుట్టు పొడిబారడం, నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోతే మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే ఔషధాలే కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్న రెమెడీస్ కూడా ప్రభావతంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరటిపండు మిశ్రమంతో తయారుచేసిన హెయిర్ మాస్క్ ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ మాస్కులను ఎలా తయారు చేసుకోవాలో.. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

అరటి హెయిర్ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలు:
అరటి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:

✺ ఒక అరటిపండు
✺ ఒక టీ స్పూన్ నిమ్మరసం
✺ ఒక టీ స్పూన్ టీ ట్రీ ఆయిల్

తయారీ విధానం:
✺ ముందుగా చిన్న బౌల్ తీసుకొని అందులో అరటిపండును మిశ్రమంల తయారుచేసుకొని వేసుకోవాలి. 
✺ తర్వాత ఒక టీ స్పూన్ నిమ్మరసం, మరో టీ స్పూన్ మరో టీ స్పూన్ టీ ట్రీ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
✺ ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

జుట్టుకు అప్లై చేసే విధానం:
✺ ఈ హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేసుకునే ముందు జుట్టును శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది.
✺ ఆ తర్వాత జుట్టుకు బనానా హెయిర్ మాస్క్ ను అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
✺ ఇలా చేసిన తర్వాత మాస్క్ పూర్తిగా ఆరిపోతుంది. ఆ తర్వాత జుట్టును చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

తెల్ల జుట్టును నల్లగా చేసే బనానా హెయిర్ మాస్క్:
ఈ మాస్క్ చేయడానికి కావలసిన పదార్థాలు:
✺ ఒక పండిన అరటిపండు
✺ రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్
✺ గుడ్డులోని తెల్ల సొన ఒకటి స్పూన్

మాస్క్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
✺ ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో పండిన అరటి పండు మిశ్రమాన్ని వేసుకోవాల్సి ఉంటుంది.
✺ తర్వాత అందులోని ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, మరో టీ స్పూన్ గుడ్డులోని తెల్ల సొన వేసుకోవాలి.
✺ ఈ మూడు పదార్థాలను బాగా కలుపుకొని 50 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.

ఈ మాస్క్ ను అప్లై చేసే విధానం:
✺ ఈ మాస్క్ ను ఉదయం తల స్నానం చేసి ముందు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
✺ దీనికోసం ముందుగా తయారుచేసి పెట్టుకున్న అరటిపండు మాస్కుని చేతిలోకి తీసుకోవాలి. 
✺ ఆ తర్వాత వెంట్రుకల కుదుళ్ల లోపల ఈ మాస్క్ ను బాగా అప్లై చేయాలి.
✺  రెండు నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి.
✺ ఆ తర్వాత 50 నిమిషాల పాటు మాస్క్ను ఆరనిచ్చి మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News