Bad Cholesterol Reduce In 8 Days: వ్యక్తి శరీర బరువు శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్ పై ఆధారపడి ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే బరువు కూడా క్రమంగా పెరుగుతారు. కాబట్టి శరీరమంతా కొలెస్ట్రాల్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా మంచిది. లేకపోతే ప్రాణాంతక వ్యాధులైన గుండెపోటు, మధుమేహం వంటి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల సిరుల్లోని పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తీసుకునే ఆహారంలో పోషకాలు అధిక పరిమాణంలో ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఆరోగ్య నిపుణులు పలు ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆహారాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చెడు కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఆహారాలు తీసుకోండి:
బెండకాయ:
బెండకాయలు జిగుటు రూపంలో గ్లూటినస్ మిశ్రమం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జీర్ణ క్రియ వ్యవస్థను కూడా మెరుగుపరిచి విసర్జన ప్రక్రియను సులభతరం చేస్తుంది. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా బెండకాయలను ఆహారంలో వినియోగించాలి.
యాపిల్:
అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఆరోగ్య నిపుణులు ఈ పండ్లను తప్పకుండా తీసుకోవాలని సూచిస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన డైటరీ ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి దీనిని ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఒకటి నుంచి రెండు తీసుకుంటే.. కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గడమే కాకుండా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
ఓట్స్:
ప్రస్తుతం చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఓట్స్‌ను వినియోగిస్తున్నారు. ఓర్సులో కరిగే ఫైబర్ విచ్చలవిడిగా లభిస్తుంది. కాబట్టి వీటిని అల్పాహారంలో భాగంగా వినియోగిస్తే అనారోగ్య సమస్యలు దూరం కావడమే కాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలు క్రమంగా తగ్గుతాయి. ఈ ఓట్స్ రెసిపీ ని తయారు చేసుకునే క్రమంలో పండ్లను వినియోగించి చేసుకుని మధ్యాహ్నం భోజనం తీసుకుంటే గుండె సమస్యలు, మధుమేహం సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి