Ayurvedic Hair Oils: ఈ 5 ఆయుర్వేద హెయిర్ ఆయిల్ జుట్టును సహజసిద్ధంగా కుదుళ్ల నుంచి బలపరుస్తాయి..

Ayurvedic Hair Oils: సాధారణంగా మన పెద్దవాళ్లు తరచూ జుట్టుకు నూనె పెట్టుకుంటే దృఢంగా పెరుగుతాయని అంటారు. ఈ మధ్యకాలంలో ఈ వైఖరి తగ్గింది అయితే నూనె పెట్టుకోవడం వల్ల మన జుట్టుకు పోషణ అందించడం పాటు రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 11, 2024, 09:40 AM IST
Ayurvedic Hair Oils: ఈ 5 ఆయుర్వేద హెయిర్ ఆయిల్ జుట్టును సహజసిద్ధంగా కుదుళ్ల నుంచి బలపరుస్తాయి..

Ayurvedic Hair Oils: సాధారణంగా మన పెద్దవాళ్లు తరచూ జుట్టుకు నూనె పెట్టుకుంటే దృఢంగా పెరుగుతాయని అంటారు. ఈ మధ్యకాలంలో ఈ వైఖరి తగ్గింది అయితే నూనె పెట్టుకోవడం వల్ల మన జుట్టుకు పోషణ అందించడం పాటు రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. దీంతో జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతాయి, బలంగా పెరుగుతుంది. దీంతో జుట్టు మందంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇంకా డ్యామేజ్ కాకుండా స్ప్లిట్ ఎండ్ సమస్య కూడా రాదు. అంతేకాదు జుట్టుకు ఆయిల్ పెట్టుకోవడం వల్ల మాయిశ్చర్ లభిస్తుంది. వారానికి రెండు మూడు సార్లు అయినా జుట్టుకు ఆయిల్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. దీంతో జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఆయుర్వేదంలో కొన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి. ఇవి న్యాచురల్ గా జుట్టును దృఢపరుస్తాయి ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

బాదం నూనె..
బాదం నూనె ఎన్నో ఎళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో జుట్టు ఆరోగ్యానికి కావలసిన పోషకాలు ఉంటాయి. జుట్టును మందంగా మారుస్తుంది ఇందులో లైపో ప్రోటీన్ ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ ఇ జుట్టుని కుదుళ్ల నుంచి పోషణ అందిస్తుంది. హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఆయుర్వేదిక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం బాదం నూనెలో మాయిశ్చర్ గుణాలు కూడా ఉంటాయి. ఇది తరచూ మన జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకుదుళ్ల నుంచి ఆరోగ్యంగా మారి మృదువుగా పెరుగుతుంది.

కొబ్బరి నూనె..
కొబ్బరి నూనెలో గత వందల సంవత్సరాలుగా మన ఆయుర్వేదంలో విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు సౌందర్య పరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో లారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. కొబ్బరి నూనె ఆరోగ్యంగా పరంగా జుట్టుని బలపరిచి ప్రోటీన్స్ లేమిని తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్ల నుంచి పోషణ అందిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కొబ్బరి నూనె జుట్టుకు పోసి మృదువైన పోషణ అందిస్తుంది. ఫ్రిజీనెస్ సమస్యను తగ్గిస్తుంది గ్లాసీ లుక్‌ జుట్టుకు అందిస్తుంది. 

ఇదీ చదవండి: ఈ ఒక్క జ్యూస్ తాగి చూడండి.. మీ తెల్ల వెంట్రుకలన్ని నల్లగా మారిపోతాయి..

మోరింగా ఆయిల్..
ఈ మొరింగ్ ఆయిల్‌ మోరింగా మునగ ఆకులు మునగ చెట్టు ద్వారా తయారు చేస్తారు. ఇందులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్, ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. మోరింగా ఆయిల్ జుట్టుకు జీవనం అందిస్తుంది కుదుళ్ల నుంచి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. అంతేకాదు ఇది త్వరగా వెంట్రుకలు తెలపడానికి నిరోధిస్తుంది. మోరింగో ఆయిల్ తో జుట్టును మసాజ్ చేయడం వల్ల సిల్కీగా కనిపిస్తుంది. ఇందులో మంట సమస్యను తగ్గించే గుణం కూడా ఉంటుంది జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది.

బృంగరాజు ఆయిల్..
బృంగరాజ్ ఆయిల్లో మన సంప్రదాయంలో విపరీతంగా ఉపయోగిస్తారు. ఇందులో చుట్టూ మృదువైన పోషణ అందిస్తుంది. ఇది జుట్టు కుదుళ్ల నుంచి బలపరుస్తుంది. దీంతో జుట్టు మందంగా కనిపిస్తుంది. హెయిర్ ఫాల్ సమస్యలకు తక్షణ చెక్ పెడుతుంది. అంతే కాదు బ్లడ్ సర్కులేషన్ కూడా మెరుగుపరిచి జుట్టు కుదుళ్ల నుంచి ఆరోగ్య పరుస్తుంది.

ఇదీ చదవండి: ఉదయం పరగడుపున ఇలా తులసి నీరు తాగితే 5 రోగాలు మీ దరి చేరవు

నువ్వుల నూనె..
నువ్వుల నూనెలో మనం వేల ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నువ్వుల నూనెతో జుట్టు మాయిశ్చర్ గా మారుతుంది. ఇది పొడిబారడాన్ని తగ్గిస్తుంది నువ్వుల నూనెలో జుట్టు బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ సమస్యల నుంచి కాపాడుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News