Asthma Winter Tips In Telugu: అత్యంత తీవ్రమైన శ్వాస కోస వ్యాధుల్లో ఆస్తమా ఒకటి. ఇది ఒక్కసారి ప్రారంభమైతే అంత సులువుగా తగ్గదని అందరికీ తెలిసిందే. చలికాలం వచ్చిందంటే చాలు ఆస్తమా రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న ఆస్తమా తీవ్రతరమవుతుంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చాలామందిలో చలికాలంలో ఆస్తమా ఉంటే దగ్గుతో పాటు విపరీతమైన చాతినొప్పి ఉబ్బసం వంటి అవస్థలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా చలికాలంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
ఉన్ని దుస్తులు ధరించాలి:
ఆస్తమాతో బాధపడుతున్న వారు చలికాలంలో శరీరానికి ఎక్కువ మోతాదులో వెచ్చదనాన్ని అందించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా ఆస్తమా తీవ్రతరం కాకుండా ఉండడానికి చలికాలంలో ఉన్ని, మందమైన దుస్తులను ధరించడం ఎంతో మంచిది. అలాగే ఈ సమయంలో కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల కూడా ఆస్తమాకు చెక్ పెట్టవచ్చు.
తులసి ఆకులతో డికాషన్:
ఆస్తమాను చలికాలంలో కంట్రోల్ చేసేందుకు ఆయుర్వేద రెమిడీలు ఎంతగానో సహాయపడతాయి. అందులో తులసి ఆకుల డికాషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. ఒక రెండు గ్లాసుల నీటిని తీసుకొని అందులో తగినన్ని తులసి ఆకులు వేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న నీటిని వడకట్టుకొని తాగితే మెరుగైన ఫలితాలను పొందుతారు.
అతిమధురం చూర్ణం..
చలికాలంలో ఆస్తమా ఉన్న వారిలో దగ్గు విపరీతంగా వస్తువుంటుంది. దీనికి తోడు ఉబ్బసం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది లోనైతే గొంతులో కఫం విపరీతంగా పేరుకుపోతూ ఉంటూ ఉంటుంది. నిజానికి వీటన్నిటిని సులభంగా తొలగించేందుకు అతిమధురం చూర్ణం ఎంతగానో సహాయపడుతుంది. రెగ్యులర్‌గా అతిమధురం చూర్ణం గోరువెచ్చని గ్లాస్ నీటిలో కలుపుకొని తాగడం వల్ల గొంతులో పేరుకుపోయిన కఫం నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా ఆస్తమా నుంచి కూడా బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అల్లం డికాషన్:
ఆస్తమాతో బాధపడే వారిలో చలికాలం వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది లోనైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలకు కూడా వస్తాయి. అయితే ఇలాంటి అప్పుడు ఆయుర్వేద ని పనులు సూచించే అల్లం డికాషన్ తాగడం చాలా మంచిది. అల్లం డికాషన్ లో ఉండే గుణాలు శరీరానికి రోగనిరోధక శక్తి అందించడమే కాకుండా శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఆస్తమా ఉన్నవారికి ఈ డికాషన్ ది బెస్ట్ రెమెడీగా పనిచేస్తుంది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.