Jasmine Oil Beauty Benefits: జాస్మిన్ ఆయిల్ గత వేల సంవత్సరాలుగా మన ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. ఇందులో ఆరోమో థెరపీ, మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యూటీపరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంది. తెల్లని మల్లెపూలతో తయారు చేసే ఈ జాస్మిన్ ఆయిల్ సుగంధం వెదజల్లుతుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అయితే జాస్మిన్ ఆయిల్‌తో మన చర్మానికి ఎన్ని విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
హైడ్రేషన్..
జాస్మిన్ ఆయిల్ చర్మాన్ని లోతుగా హైడ్రేషన్ చేస్తుంది. ఇది స్కిన్ ఆ మాయిశ్చర్ ని లాక్ చేసే గుణాలు కలిగి ఉంటుంది. దీంతో రోజంతటికి కావాల్సిన అందాన్ని స్కిన్‌కు అందించడంతోపాటు మీ ముఖం మెరిసేలా చేస్తుంది. అంతేకాదు జాస్మీన్ ఆయల్ వల్ల రోజంతా మీ ముఖం తాజాదనంగా కనిపిస్తుంది.
యాక్నే..
జాస్మిన్ ఆయిల్ మీ బ్యూటీ రొటీన్ లో యాడ్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే సహజసిద్ధమైన యాంటీ సెప్టెక్ గుణాలు యాక్నేను సహజసిద్ధంగా తగ్గించేస్తుంది. ఇది ఇన్ల్ఫమేషన్ సమస్యను తగ్గించేసి హానికర బ్యాక్టీరియా చర్మంపై పెరగకుండా కాపాడుతుంది. జాస్మిన్ ఆయిల్ తో సులభంగా యాక్నేకు చెక్ పెట్టొచ్చు.
యాంటీ ఏజింగ్ గుణాలు..
జాస్మిన్ ఆయిల్ మీ బ్యూటీ రొటీన్ లో యాడ్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్ ఆక్సిడేటీవ్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. ఇది వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే గుణాలు కలిగి ఉంటాయి. దీంతో ముఖంపై గీతలు, మచ్చలు కనబడకుండా ఉంటాయి.
స్కిన్ టోన్..
జాస్మిన్ ఆయిల్ ముఖానికి తరచుగా అప్లై చేయడం వల్ల ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో మీ చర్మం మృదువుగా మెత్తగా సాగే గుణం కలిగి ఉంటుంది. మీ చర్మం టోన్ కూడా మెరుగుపడుతుంది.
ఇదీ చదవండి: రాఖీ పౌర్ణమి ప్రత్యేక మెహందీ చిత్రాలు.. నిమిషంలో వేసుకునే రక్షాబంధన్ డిజైన్స్..
గీతలు మాయం..
జాస్మిన్ ఆయిల్ బ్యూటీ రొటీన్ లో యాడ్ చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే మచ్చలు, గీతలకు చెక్ పెడుతుంది. స్ట్రెచ్ మార్క్స్ కూడా కనిపించకుండా పోతాయి. ఇవి జాస్మిన్ ఆయిల్ కణాల పునర్జీవనానికి తోడ్పడుతాయి దీంతో పి చర్మ రంగు కూడా మెరుగు పడుతుంది.
ఆయిల్ ఉత్పత్తిని సమతుల్యం చేస్తుంది
జాస్మిన్ ఆయిల్ స్కిన్ పై అదనంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్ ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ ఆయిల్ అన్ని చర్మాల రకాల వారికి మంచిది దీంతో మీ చర్మం తరచుగా పొడిబారకుండా ఉంటుంది.
సున్నిత చర్మం..
అంతేకాదు జాస్మిన్ ఆయిల్ మీ బ్యూటీ రొటీన్ లో చేర్చుకోవడం వల్ల సున్నిత చర్మం ఉన్నవారికి కూడా మంచిది. ఇది ముఖంపై పెరుగుతున్న దురదను, ఎర్రని పొడిబారే తత్వాన్ని తగ్గించి మంచి పోషణను అందించి చర్మాన్ని రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
ఇదీ చదవండి: పెరుగుతున్న దోమలు.. మీ పిల్లల్ని 6 విధాలుగా రక్షించుకోండి..
యాంటీ ఇన్ఫ్లమేటరీ..
జాస్మిన్ ఆయిల్ బ్యూటీ రొటీన్ లో ఉండడం వల్ల ఇందులో ఉండే యాక్టివ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మం పై వచ్చే మచ్చలు, దురదలకు చెక్ పెడతాయి .దీంతో మంట వాపు సమస్య తగ్గిపోతుంది చర్మంపై ఎజిమా, డెర్మటైటీస్ ఇతర చర్మ సమస్యలు రాకుండా నివారిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter