Acidity, Constipation: ఎలాంటి ఖర్చు లేకుండా చలి కాలంలో మలబద్ధకం, అజీర్ణం సమస్యలకు ఇలా చెక్‌ పెట్టొచ్చు..

Acidity And Constipation: చలి కాలంలో చాలా మంది పొట్ట సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎండు ద్రక్షలను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తినడం వల్ల అనారోగ్య సమ్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 10:41 AM IST
Acidity, Constipation: ఎలాంటి ఖర్చు లేకుండా చలి కాలంలో మలబద్ధకం, అజీర్ణం సమస్యలకు ఇలా చెక్‌ పెట్టొచ్చు..

Acidity And Constipation: చలికాలంలో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రావడం సర్వ సాధారణం. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు చలి తీవ్రతనేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పొట్ట సమస్యలేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పొట్ట సమస్యలైన అజీర్తి సమస్యల నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జీవక్రియ సమస్యలు:

చలికాలంలో జీవక్రియ రేటు సులభంగా మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాతావరణంలో తేమ పరిమాణాలు అధికంగా పెరగడం వల్ల దాని ప్రభావం జీర్ణవ్యవస్థపై పడుతుంది. దీంతో జీవక్రియ బలహీనత మారి అజీర్ణం సమస్యలు ఉత్పన్నమవుతాయి.

వేయించిన ఆహారం:

చలికాలంలో ఆయిల్‌తో కూడిన ఆహారాలు, స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. అతిగా వేయించిన ఆహారం కూడా అజీర్ణానికి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చలి కాలంలో నూనె, మసాలా దినుసులు జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. దీంతో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పొట్ట సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

నిర్జలీకరణం:

చలి తీవ్ర కారణంగా చాలా మందిలో దాహం తక్కువగా అవుతుంది. దీంతో చాలా మందిలో శరీరం డీహైడ్రేషన్‌ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా దీని కారణంగా ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. కాబట్టి శరీరం చలి కాలంలో ఆరోగ్యంగా ఉండడానికి నీటిని అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో ఆల్కహాల్ వల్ల కూడా డీహైడ్రేషన్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.

వీటితో ఉపశమనం కలుగుతుంది:

- చలి కాలంలో మలబద్ధకం సమస్యల నుంచి సులభంగా ఉపశనం పొందడానికి తప్పకుండా ఆహారంలో బొప్పాయి పండును చేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ బొప్పాయి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరుమవుతాయి.

- చలికాలంలో తరచుగా అజీర్తి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ క్రమంలో నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పొట్ట సమస్యలతో బాధపడుతన్నవారు ఉదయం ఖాళీ కడుపుతో ఎండుద్రాక్షను ప్రతి రోజూ తినాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

 

Also Read: Buttabomma poster copy: పోస్టర్ ను కూడా కాపీ కొట్టాలా..పాపం నాగవంశీని ఆడేసుకుంటున్నారుగా

Also Read: Ashu Reddy Hot Photos: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి అందాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News