7 Superfoods For Voluminous Hair Growth: జుట్టు పొడుగ్గా, మందంగా పెరగాలని ఎంతోమంది అనుకుంటారు. కానీ ఈ కాలంలో జుట్టు హెయిర్ ఫాల్ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. దీనికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. అనేక సౌందర్య ఉత్పత్తులను వాడుతున్నారు. ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. అయితే జుట్టు పెరుగుదలకు హెయిర్ ఫాల్ సమస్య అధిగమించలేకపోతున్నారు. అయితే ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు హెయిర్ ఫాల్ సమస్యను అధిగమించడానికి డైట్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్ ఎలాంటి ఆక్సిడెంట్సు ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహారాలు ఉండని దీంతో మీ జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా మందంగా పెరుగుతుంది. ముఖ్యంగా 7 రకాల పండ్లు మీ డైట్ లో ఉంటే మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ పండ్లలో మన జుట్టు పోషణ కావాల్సిన విటమిన్స్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
బ్లూ బెర్రీ, స్ట్రాబెరీ, రాస్బెర్రీ అంటే పండ్లను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మన జుట్టు మందంగా ఆరోగ్యంగా, మెరుస్తూ పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది.
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజ్ లెమన్, గ్రేప్ ఫ్రూట్ ఈ సీట్రస్ పండ్లను కూడా మన డైట్ లో చేసుకోవాలి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుందో మన జుట్టు పెరుగుదలకు కోల్లాజెన్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇదీ చదవండి: మీ ముఖానికి సరిపోయే షీట్ మాస్కులు ఎలా ఎన్నుకోవాలో తెలుసా?
అంతేకాదు అవకాడోలో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ అలాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో కూడా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన జుట్టు పెరుగుదలకు పోషణను అందిస్తాయి. జుట్టు పొడిబాడకుండా మెరుస్తూ కనిపించేలా సహాయపడుతుంది.
అరటి పండ్లలో పొటాషియం, విటమిన్స్ సహజసిద్ధమైన ఆయిల్స్ ఉంటాయి. ఇది కూడా మన ఆరోగ్యకరమైన జుట్టుకు సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా స్ప్లిట్ ఎండ్ సమస్య రాకుండా హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
పైనాపిల్‌లో విటమిన్ సి, మ్యాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కొల్లాజన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంతో జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ బ్రేకెజ్ సమస్య రాదు
కీవీలో కూడా విటమిన్ సి, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన కుదుళ్లకు ప్రేరేపించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
ఇదీ చదవండి: లీచి పండుతో బరువు త్వరగా తగ్గొచ్చు అని మీకు తెలుసా?
బొప్పాయి అన్ని సీజన్లో అందుబాటులో ఉండే బొప్పాయిలో విటమిన్ ఏ, సి, ఈ ఫోలేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా కుదళ్లకు రక్తప్రసరణ మెరుగుపరిచి హెయిర్ ఫాలికల్స్ కి తోడ్పడి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి