#ZeeIndiaConclave: నేను నేతను కాదు.. యోగిని: ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ ఇండియా కాన్‌క్లేవ్ సదస్సులో తన అభిప్రాయాలు పంచుకున్నారు.

Last Updated : Mar 18, 2018, 06:23 AM IST
#ZeeIndiaConclave: నేను నేతను కాదు.. యోగిని:  ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ ఇండియా కాన్‌క్లేవ్ సదస్సులో తన అభిప్రాయాలు పంచుకున్నారు. తానో నేతను కాదని.. ఓ యోగిని అని ఆయన తెలిపారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన విషాద ఘటనలు అనుకోకుండా జరిగినవని.. కానీ పుకార్ల వల్లే ప్రజల్లోకి తమ పార్టీపై చెడు సంకేతాలు వెళ్లాయని ఆయన అన్నారు. 2019లో బీజేపీకే మళ్లీ పీఠం దక్కుతుందని తెలిపిన ఆదిత్యనాథ్, థర్డ్ ఫ్రంట్ ఆలోచనలు యూపీని తాకడం కొత్తకాదని ఆయన అన్నారు. తమ పార్టీలో అంతర్గత విభేదాలు లేవని.. యూపీ బైపోల్స్‌లో పార్టీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేశారని చెప్పారు.

అయినా గోరఖ్‌పూర్‌లో తమ పార్టీ అపజయం పొందడాన్ని పాఠంగానే స్వీకరిస్తామని.. 2014లో కూడా మోదీని ఎదుర్కోవడానికి అనేక పార్టీలు కలిసి వెళ్లాయని.. అయినా ఫలితాలు తమకే అనుకూలంగా వచ్చాయని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. యూపీలో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ కలిసి పనిచేయడమన్న విషయం ప్రజలను మభ్య పెట్టే అంశమని.. వారిలో సఖ్యత ఉంటే.. తమ నాయకుడిగా ఎవరి పేరు చెబుతారో వారు ఆలోచించాలని ఆదిత్యానాథ్ ప్రశ్నించారు.  బై పోల్స్ లోకల్ పాలిటిక్స్‌లో భాగమని.. కానీ తమ ఆలోచనలు అన్నీ కూడా 2019 ఎన్నికలపైనే గురి పెడుతున్నాయని ఆదిత్యనాథ్ తెలిపారు

Trending News