సీఎం ఇంటి ముందు సెల్ఫీ.. చట్టరీత్యా నేరమే..!

యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఎవరైనా సెల్ఫీ తీసుకుంటే.. వారు జైలుకు వెళ్లాల్సిందే.

Last Updated : Dec 22, 2017, 03:28 PM IST
సీఎం ఇంటి ముందు సెల్ఫీ.. చట్టరీత్యా నేరమే..!

యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఎవరైనా సెల్ఫీ తీసుకుంటే.. వారు జైలుకు వెళ్లాల్సిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో పాటు పలు విమర్శలు చేస్తూ.. ఇటీవలే ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. ఇటీవలే సీఎం ఇంటి ముందు పోలీసులు పెట్టిన ఓ బ్యానరు సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది "మన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇంటి ముందు సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే మీరు పోలీస్ స్టేషనుకు వెళ్లాల్సిందే. ఇది వీఐపీ ఏరియా, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం.

ఇక్కడ సెల్ఫీలు  తీసుకోవద్దు. అలా చేస్తే మీరు శిక్షార్హులు’ అని పేర్కొంటూ బ్యానర్‌ కట్టారు. అయితే ఈ బ్యానరుపై అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. గతంలో కూడా బహుజన్‌ సమాజ్‌పార్టీ నేత మాయావతి  సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆమె ఇంటి ముందు మీడియా లేదా ఇతర వ్యక్తులు ఎవరైనా సరే.. ఫొటోలు తీయకూడదంటూ ఆంక్షలు విధించారు. ఆ తర్వాత 2012లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన అఖిలేశ్‌ ఆ ఆంక్షలను ఎత్తివేశారు. ప్రస్తుతం అఖిలేష్ బ్యానరు విషయమై ట్వీట్ చేశాక, పోలీసులు ఆ బ్యానరును తొలిగించడం గమనార్హం. 

Trending News