Wrong Challan: ఇలా చేస్తే.. మీ చలాన్‌లు కట్టాల్సిన అవసరం లేదు!

How To Avoid Paying Fine For Wrong E Challan. రోడ్లపై వాహనాలు నడిపే వారిలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో అలవాటులో పొరపాటుగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తుంటారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 29, 2022, 05:42 PM IST
  • అలవాటులో పొరపాటుగా
  • జరిమానాతో పాటుగా జైలు
  • ఇలా చేస్తే.. మీ చలాన్‌లు కట్టాల్సిన అవసరం లేదు
Wrong Challan: ఇలా చేస్తే.. మీ చలాన్‌లు కట్టాల్సిన అవసరం లేదు!

Here is the steps To Avoid Paying Fine For Wrong E Challan: మన దేశంలో రోడ్లపై వాహనాలు నడిపే వారిలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో అలవాటులో పొరపాటుగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోకున్నా, సిగ్నల్ జంప్ చేసినా, ర్యాష్‌ డ్రైవింగ్ చేసినా, ఓవర్ స్పీడ్ వెళ్లినా ట్రాఫిక్ పోలీసులు చలాన్స్ వేస్తారు. అదే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్లూషన్, ఇన్సూరెన్స్ లేకున్నా చలాన్స్ రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా పాటిస్తేనే చలాన్‌లు నుంచి విముక్తి పొందవచ్చు. 

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ప్రస్తుత మోటారు వాహనాల చట్టాల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు శిక్షలు విధిస్తారు. జరిమానా విధించడంతో పాటుగా జైలుకు వెళ్లే వరకు నిబంధనలు ఉన్నాయి. వాహనదారులు తప్పు చేసినట్లే ట్రాఫిక్ పోలీసులు తప్పు చేసే అవకాశం ఉంటుంది. పొరపాటున నెంబర్ తప్పుగా కొట్టడం, ఒక ఫైన్‌కు బదులుగా మరొక ఫైన్‌ను ఎంట్రీ చేసినా మీరు చలాన్‌ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలా రాంగ్ చలాన్‌లు పడితే మీరు ఇలా చేస్తే సరిపోద్ది. 

ట్రాఫిక్ పోలీసు పొరపాటున మీకు చలాన్‌ను వేసినట్లయితే.. సంబంధిత విభాగాన్ని (ట్రాఫిక్ పోలీస్) సంప్రదించవచ్చు అనే నిబంధన కూడా ఉంది. మీరు ట్రాఫిక్ పోలీసు విభాగంలోని ఉన్నత అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. మీరు ట్రాఫిక్ నియమాన్ని ఉల్లంఘించలేదని, మీ చలాన్ తప్పుగా పడిందని తెలపాలి. మీ ఫిర్యాదు సరైనది అయితే.. మీ చలాన్ రద్దు చేయబడుతుంది.  అలా కాకున్నా మీరు కోర్టులో కూడా చలాన్‌ను సవాలు చేయవచ్చు. 

Also Read: Tenant War:సొంత భవంతి ఉన్నా వారం రోజులు మెట్లపైనే యజమాని కుటుంబం.. ఎందుకో తెలుసా? 

Also Read: Vijay Rashmika Love: రష్మికతో ప్రేమలో విజయ్ దేవరకొండ.. బయటపెట్టేసిన అనన్య పాండే.. ఇదిగో వీడియో  

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News