Rakesh Tikait : ప్రభుత్వ కార్యాలయాలను రైతు మార్కెట్లుగా మారుస్తామంటున్న రాకేశ్ టికాయత్

 Rakesh Tikait warns Centre : ప్రభుత్వ కార్యాలయాలను రైతు మార్కెట్లుగా.. గల్లా మండీలుగా మారుస్తామన్నారు. ఘజియాపూర్, ( Ghazipur) టిక్రి సరిహద్దుల్లోని (Tikri borders) బారికేడ్లు, సిమెంట్ బ్లాక్‌లను ఢిల్లీ పోలీసులు తొలగించిన నేపథ్యంలో టికాయత్  ఈ వ్యాఖ్యలు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2021, 03:52 PM IST
  • నిరసనలు సాగిస్తున్న రైతులను బలవంతంగా తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..
  • భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ హెచ్చరిక
Rakesh Tikait : ప్రభుత్వ కార్యాలయాలను రైతు మార్కెట్లుగా మారుస్తామంటున్న రాకేశ్ టికాయత్

Will turn govt offices into 'galla mandi' if farmers removed forcibly from borders, Rakesh Tikait warns Centre : సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు సాగిస్తున్న రైతులను సరిహద్దుల నుంచి బలవంతంగా తొలగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయాని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) (Bharatiya Kisan Union) (BKU)నేత రాకేశ్‌ టికాయత్ (Rakesh Tikait) కేంద్రాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలను రైతు మార్కెట్లుగా.. గల్లా మండీలుగా మారుస్తామన్నారు. ఘజియాపూర్, ( Ghazipur) టిక్రి సరిహద్దుల్లోని (Tikri borders) బారికేడ్లు, సిమెంట్ బ్లాక్‌లను ఢిల్లీ పోలీసులు తొలగించిన నేపథ్యంలో టికాయత్  ఈ వ్యాఖ్యలు చేశారు.

రైతు ఆందోళనకారులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా దేశ రాజధాని శివార్లలో పలు వరుసల్లో నిర్మించిన వివిధ రకాల బారికేడ్లను పోలీసులు ఇటీవల తొలగించారు. సింఘు, టిక్రీ, గాజీపుర్‌లలో(Ghazipur) వేల మంది రైతులు గత ఏడాది నవంబరు 26 (November 26, 2020) నుంచి కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన శిబిరాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. అయితే రైతులకు నిరసనలు కొనసాగించే హక్కు ఉందని, నిరవధికంగా రహదారులను దిగ్బంధించరాదని ఈ నెల 21న సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది.

Also Read : Whats App Cash Back: వాట్సాప్ పేమెంట్స్‌లో రూ. 255 క్యాష్‌బ్యాక్‌..త్వరపడండి!

దీంతో పోలీసులు బారికేడ్లను తొలగిస్తున్నారు. రైతులు ఆందోళన చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్ లను తొలగించారు. రైతులు అక్కడ నుండి ఖాళీ చెయ్యాలని, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించవద్దని కోరుతున్నారు. సరిహద్దు మీదుగా ఢిల్లీ లోకి (Delhi) రైతులు ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

అయితే నిరసన శిబిరాలను కూడా తొలగించే అవకాశం ఉందని వార్తలు రావడంతో రాకేశ్‌ టికాయత్‌ (Rakesh Tikait) తాజా వ్యాఖ్యలు చేశారు. రైతుల (farmers) ఆందోళనను అడ్డుకుంటే వినూత్న నిరసనలు దిగుతామని స్పష్టం చేశారు.

Also Read : Huzurabad byelection: 'ఉప ఎన్నికలో విజయం కోసం టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు డబ్బులు పంచారు'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News