ఇసిని అడిగి ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేస్తారా: ప్రధాని మోదీ

ఇసిని అడిగి ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేస్తారా: ప్రధాని మోదీ

Last Updated : May 12, 2019, 02:12 PM IST
ఇసిని అడిగి ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేస్తారా: ప్రధాని మోదీ

ఖుషీనగర్: లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలన్ని తేలిపోతాయని, ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వమే అధికారంలోకొస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఓటర్లు సమర్థవంతమైన, నిజాయితీ కలిగిన ప్రభుత్వాన్నే ఎన్నుకుంటున్నారని చెబుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో నేడు జరిగిన ఎన్నికల ర్యాలీ వేదికగా ప్రధాని మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్పీ-బీఎస్పీ పార్టీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్, మాయావతి ఇద్దరూ ముఖ్యమంత్రులుగా చేసిన కాలంకన్నా ఎక్కువ కాలం తాను ఒక్కడే గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశానని, కానీ వారిపై అవినీతి ఆరోపణలు వచ్చినట్టుగా తనపై రాలేదని అన్నారు. రాజస్థాన్ లోని ఆల్వార్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం ఘటనలో మాయావతి మొసలి కన్నీరు కారుస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఒకవేళ దళిత మహిళకు అంత అన్యాయం జరిగిందని భావించినట్టయితే, రాజస్తాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎందుకు మద్దతు ఉపసంహరించుకోలేదని మాయావతిని ప్రశ్నించారు. 

ఆదివారం జమ్ముకశ్మీర్ షోఫియాన్ జిల్లాలో ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌ని సైతం ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేసిన మోదీ.. ఉగ్రవాదులు ఎదురొచ్చినప్పుడు కూడా ఆర్మీ జవాన్లు ఎన్నికల సంఘం అనుమతి తీసుకునే కాల్పులు జరపాలా అని ఎద్దేవా చేశారు.

Trending News