Atishi Marlena Delhi new Cm: దేశ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుందని చెప్పుకొవచ్చు. సీఎం కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠానికి రాజీనామా చేసి.. తన తదుపరి సీఎంగా.. ఆతిశి మార్లెనాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో మంగళవారం ఢిల్లీలో ఆప్ కార్యాలయంలో.. సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఆతిశీ పేరును మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రపోజ్ చేయగా మిగత ఎమ్మెల్యేలు సైతం ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఇప్పుడు ఢిల్లీకి ఒక మహిళ సీఎంగా పీఠంను ఆతిశీ ఎక్కబోతున్నారు.
మరోవైపు ఢిల్లీకి మూడో మహిళ సీఎంగా ఆతిశీ రికార్డులకు ఎక్కబోతున్నారు. గతంలో ఇద్దరు మహిళలు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీ పార్టీకి చెందిన.. సుష్మా స్వరాజ్.. 1998 అక్టోబర్ 12 నుంచి 1998 డిసెంబర్ 3 వరకు సీఎంగా సేవలు అందించారు. ఆతర్వాత కాంగ్రెస్ కు చెందిన..షీలా దీక్షిత్ 1998 డిసెంబర్, 2013 వరకు పనిచేశారు. ఈక్రమంలో ప్రస్తుతం ..
ఢిల్లీ కేబినెట్లోని ఏకైక మహిళా మంత్రి అతిషి మర్లెనా సింగ్ ఉన్నారు. ఆమె ఆప్ ప్రభుత్వంలో అత్యధిక మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆతిశీ కల్కాజీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా గెలుపొందారు. మరోవైపు.. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్‌పై జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన తర్వాత.. అనేక మంది సీనియర్ ఆప్ నేతల పేర్లు సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
ఈ అభ్యర్థుల్లో మంత్రులు అతిషి, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఉన్నారు. అయితే, లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్, ఆయన మాజీ డిప్యూటీ మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత.. ఆతీషి కీలక పాత్రపోశించినట్లు తెలుస్తోంది.
అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు .. ఆయన హెల్త్ పై ఎక్స్ లో ఆతిశీ ఎప్పటికప్పుడు ట్విట్ లు చేసేవారు. మార్చి 21 న కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత.. ఆయన బరువు తగ్గారని, షుగర్ లెవల్స్, జైలులో ఫుడ్, ట్యాబ్లెట్స్ ఇవ్వడంలేదని ఆవేదన చెందుతూ యాక్టివ్ గా ఉండేవారు. మరోవైపు బీజేపీ కుట్రలు చేస్తుందని పదునైన వ్యాఖ్యలు చేస్తు.. సీబీఐ, ఈడీలు తమను అరెస్ట్ చేస్తాయని కూడా ఆతీశి బీజేపీని ఇరుకున పెట్టే పనులు సైతం చేశారు. బీజేపీ.. ఆప్ నేతల్ని అరెస్ట్ చేయించి.. ఢిల్లీలో ప్రభుత్వ పడిపోయేలా చేసేందుకు కుట్రలు చేస్తుదని కూడా ఆతీశీ ప్రజల్లోకి తీసుకెళ్లారు.
మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆయన మాజీ డిప్యూటీ మనీష్ సిసోడియా కూడా జైలులో ఉండడంతో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ రెండో స్థానంలో ఎవరూ లేరు. ఈక్రమంలో అతిశీ కేజ్రీవాల్ ఆదేశాలు పాటిస్తూ.. అన్నితానై పార్టీని ముందుండి నడించినట్లు తెలుస్తోంది. ఒకవైపు కేంద్రం ఆరోపణల్ని బలంగా తిప్పికొడుతూనే మరోవైపు.. ప్రజల్లో ఆప్ పట్ల వ్యతిరేకత భావం రాకుండా కూడా ఆతిశీ చర్యలు తీసుకొవడంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా.. సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి లోక్‌సభ ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహారించారు. జూన్‌లో,ఢిల్లీలో జనాలు నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో.. నీటి సంక్షోభాన్ని సృష్టించి, రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని విడుదల చేయనందుకు హర్యానా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు . ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అతిషీని ముఖ్యమంత్రిని చేయవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఆప్ అధినేత జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకున్నారు.
అత్యధిక పొర్ట్ పోలియోలు..
గతేడాది మార్చి 9న ఢిల్లీ కేబినెట్లో ఆప్ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సౌరభ్ భరద్వాజ్‌కు ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, నీరు, పరిశ్రమల శాఖల బాధ్యతలు అప్పగించగా, ఆతీశీ14 శాఖల బాధ్యతలను అరవింద్ కేజ్రీవాల్ అప్పచెప్పారు. అదే విధంగా.. వీటిల్లో..విద్య, ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, తాగు నీరు, కరెంట్, ప్రజా సంబంధాలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను అతిషి చూసుకుంటున్నారు.
Read more: Viral Video: వినాయక నిమజ్జనం వేళ అద్భుతం.. గణపయ్య మెడలో చేరిన నాగు పాము.. వీడియో వైరల్..
ముఖ్యంగా.. దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాపరమైన సంస్కరణలకు ఆతీశీ నాందీపలికారని చెప్పుకొవచ్చు. డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సలహాదారుగా, పాఠశాల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో, బోధనా ప్రమాణాలను పెంచడంలో ఎంతో పాటుపడ్డారు. "హ్యాపీనెస్ కరిక్యులమ్" - "ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్‌సెట్ కరిక్యులమ్" వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో ఆమె ప్రధాన భూమిక పోషించారని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.