Dangerous Strain: ఇండియాలో గుర్తించిన వైరస్ వేరియంట్ అతి ప్రమాదకరం

Dangerous Strain: కరోనా మహమ్మారి దేశంలో అతి భయంకరంగా విస్తరిస్తోంది. రికార్డు స్థాయిలో అతి వేగంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. దేశంలో బయటపడిన వైరస్ వేరియంట్ అత్యంత ఆందోళనకర వైరస్‌గా తెలుస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 11, 2021, 03:41 PM IST
Dangerous Strain: ఇండియాలో గుర్తించిన వైరస్ వేరియంట్ అతి ప్రమాదకరం

Dangerous Strain: కరోనా మహమ్మారి దేశంలో అతి భయంకరంగా విస్తరిస్తోంది. రికార్డు స్థాయిలో అతి వేగంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. దేశంలో బయటపడిన వైరస్ వేరియంట్ అత్యంత ఆందోళనకర వైరస్‌గా తెలుస్తోంది.

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్( Corona Second Wave) ఉధృతి తీవ్రంగా ఉంది. దేశంలో బయటపడిన కరోనా వైరస్‌ బి 1.617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకరమైన స్ట్రెయిన్‌గా వర్గీకరించింది. ఇండియన్‌ స్ట్రెయిన్‌పై పరిశోధనలు చేస్తున్నామని, బి 1.617 వేరియంట్ ( B1.617 Virus Variant)వ్యాప్తి గురించి వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ కోవిడ్‌-19 సాంకేతిక విభాగం వివరాల్ని వెల్లడించింది. ఇండియన్‌ వేరియంట్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ల్యాబ్‌ టీం, ఎపీ టీం పరిశోధనలు చేస్తోంది. ఈ వైరస్‌ గురించి  తమకు అవగాహన ఉందని.. స్థానికంగా, ఇతర దేశాల్లో భారత స్ట్రెయిన్‌( Covid Indian Strain)పై చేస్తున్న అధ్యయనాలు పరిశీలిస్తున్నామని వెల్లడించింది.

ఇప్పటివరకూ లభించిన సమాచారం మేరకు ఇండియాలో గుర్తించిన వేరియంట్‌ను ఆందోళనకరమైన వేరియంట్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (World health organisation) పరిగణించింది. అయితే ఈ వేరియంట్‌పై మరింత సమాచారం సేకరించాల్సి ఉందని..జన్యుక్రమాన్ని విశ్లేషించాలని తెలిపింది. భవిష్యత్‌లో మరిన్ని వేరియంట్‌లు చూడాల్సి వస్తుందని..వీలైనంత మేరకు వైరస్ సంక్రమణను అడ్డుకట్ట వేస్తూ తీవ్రరూపం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వ్యక్తిగతంగా అందరూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.  

Also read: Double Mask: డబుల్ మాస్క్ ఎంతవరకూ క్షేమం, కేంద్రం మార్గదర్శకాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News