Monsoon Update: రుతు పవనాలు మరింత ఆలస్యం.. మరో 5 రోజులు ఎండలు.. తప్పని ఉక్కపోత!

Monsoon Update: ఈ ఏడాది వాతావరణం భయపెడుతోంది. ఓ వైపు మండుతున్న ఎండలు. మరోవైపు రుతుపవనాల ఆలస్యం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా. రుతుపవనాలు దేశాన్ని ఎప్పుడు తాకనున్నాయో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2023, 05:15 PM IST
Monsoon Update: రుతు పవనాలు మరింత ఆలస్యం.. మరో 5 రోజులు ఎండలు.. తప్పని ఉక్కపోత!

Monsoon Update: నైరుతి రుతు పవనాల రాక ఈసారి మరింత ఆలస్యం కానుంది. రుతు పవనాల విషయంలో వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి. జూన్ 1 నాటికి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాగనున్నాయనేది అంచనా. కానీ ఇప్పటి వరకూ రుతు పవనాలు కేరళకు చేరలేదు. అంటే ఇతర రాష్ట్రాలకు ఇంకెప్పుడు వ్యాపిస్తాయనేది సందేహంగా మారింది. 

ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. జూన్ మొదటి వారంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు 43-46 మధ్య నమోదవుతున్నాయి. మరోవైపు గత నాలుగైదు రోజుల్నించి తీవ్రమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రుతుపవనాలు ప్రవేశిస్తే వర్షాలతో ఉపశమనం పొందవచ్చని ఆశించిన ప్రజల ఆశలు నెరవేరేలా లేవు. జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకాల్సిన రుతు పవనాలు ఇంకా చేరలేదు. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా గాలులు వీస్తున్నా ఇంకా బలపడాల్సి ఉంది. రుతు పవనాలు ఎప్పుడు తాకేది ఇవాళ స్పష్టత రావచ్చు. రెండ్రోజుల్లో కేరళను తాకినా..దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించేందుకు మరో 4-5 రోజులు సమయం పట్టనుంది. 

వాస్తవానికి ఈ ఏడాది వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది రాత్రి 10 గంటలైనా వాతావరణం చల్లబడటం లేదు. గాలిలో తేమ లేకపోవడంతో వడగాల్పుల ప్రభావం ఎక్కువైంది. తీవ్రమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. జూన్ మొదటి వారంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో 45 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ 2023.. రిషభ్‌ పంత్‌కు తుది జట్టులో చోటు!

మరోవైపు దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకూ విస్తరించి ఉంది. ఫలితంగా ఏపీలో నిన్న సాయంత్రం అక్కడక్కడా స్వల్ప వర్షాలు కురిశాయి. వెరసి రుతు పవనాలు ఈ ఏడాది ఆలస్యమౌతున్నాయి. రెండ్రోజుల్లో రుతు పవనాలు కేరళను తాకితే..ఆ తరువాత అంటే 4-5 రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించవచ్చు. 

Also Read: Bihar Bridge Collapse: నిర్మాణంలోనే గంగా నదిలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News