AAP: వెంటిలేటర్ పై కాంగ్రెస్, ఆప్ ఒక్కటే ప్రత్యామ్నాయం

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రజలు అందించిన అధికారాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోతోంది. కరిష్మా ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వదిలిపోతున్నారు. ఈ నేపద్యంలో వెంటిలేటర్ పై ఉన్న ఆ పార్టీకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఆప్ ( AAP ) సన్నాహాలు చేస్తోంది. ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చడ్డా వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

Last Updated : Jul 17, 2020, 02:02 PM IST
AAP: వెంటిలేటర్ పై కాంగ్రెస్, ఆప్ ఒక్కటే ప్రత్యామ్నాయం

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రజలు అందించిన అధికారాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోతోంది. కరిష్మా ఉన్న పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వదిలిపోతున్నారు. ఈ నేపద్యంలో వెంటిలేటర్ పై ఉన్న ఆ పార్టీకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఆప్ ( AAP ) సన్నాహాలు చేస్తోంది. ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చడ్డా వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.

రాజస్థాన్ లో నెలకొన్న సంక్షోభం ( Rajasthan Crisis ) నేపధ్యంలో వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది. పార్టీ  స్వయంకృతాపరాధ నిర్ణయాలు, గాంధీ కుటుంబ పాలన ( Gandhi Family Rule ) వెరసి ఆ పార్టీని ఇంకా నష్టపరుస్తున్నాయి. ప్రజలు అందిస్తున్న అధికారాన్ని సైతం నిలబెట్టుకోలేని దుస్థితిలో ఆ పార్టీ ఉందిప్పుడు. దీనికి పక్కా నిదర్శనం ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ( Madhya pradesh ) వ్యవహారం. ఎంపీ ( MP ) లో కాంగ్రెస్ పార్టీకు ప్రజలు అందలమెక్కించినా...పార్టీలో నెలకొన్న గ్రూపిజం కారణంగా ప్రజాకర్షణ కలిగిన జ్యోతిరాదిత్య సింధియా ( Jyothiraditya Sindhiya ) వంటి నేతను పార్టీ దూరం చేసుకుంది. ఫలితం ప్రభుత్వం బీజేపీ ( BJP ) చేతిలోకెళ్లింది. అంతకుముందు కర్నాటకలో ( Karnataka ) దాదాపు అదే జరిగింది. జేడీఎఎస్ ( JDS ) తో కలిసి కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రభుత్వం కూడా నిలబడలేకపోయింది. అక్కడ కూడా బీజేపీ పగ్గాలు చేజిక్కించుకుంది. ఇప్పుడు రాజస్థాన్ ( Rajasthan ) లో అదే జరగబోతుందన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. Also read: Arogya Setu: ఆరోగ్యసేతుకు అరుదైన ఘనత

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ( CM Ashok Gehlot ) తో విబేధాల కారణంగా డిప్యూటీ సీఎం ( Deputy cm ) , పీసీసీ చీఫ్ ( PCC Chief ) అయిన ప్రజాకర్షక నేత సచిన్ పైలట్ ( Sachin Pilot ) పార్టీ నుంచి దాదాపు దూరమైపోయారు. తిరుగుబాటు ఎగరేశారనే కారణంతో డిప్యూటీ సీఎం, సీసీసీ చీఫ్ పదవుల్నించి అధిష్టానం సచిన్ పైలట్ ను తప్పించేసింది. ఈ నేపధ్యంలో  అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ( Ashok Gehlot Government in minority ) మెనార్టీలో పడినట్టేనని తెలుస్తోంది. పార్టీ స్వయంకృతాపరాధం కారణంగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకునే పరిస్థితులు కన్పిస్తున్నాయి ఇక్కడ. Also read: International flights: అమెరికా, ఫ్రాన్స్ విమానాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అటు ఢిల్లీలో మూడుసార్లు వరుసగా అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ జీరోకు పరిమితమైపోయింది. ఇదే ఢిల్లీలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ( Aam Aadmi Party ) ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకు ప్రత్యామ్నాయంగా కన్పిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వెంటిలేటర్ ( Congress on Ventilator ) పై ఉన్న కాంగ్రెస్ కు తాము మాత్రమే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాఘవ్ చడ్డా ( Aap Spokes person Raghav Chadda ) స్పష్టంగా వ్యాఖ్యానించడం దీనికి కారణం. ప్లాస్మా థెరపీ లేదా మరే విధమైన చికిత్స అందించినా కాంగ్రెస్ పార్టీ బతకదంటూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. భవిష్యత్  లో ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద పార్టీగా అవతరిస్తుందని రాఘవ్ చడ్డా స్పష్టం చేశారు. ఈ దిశగా పార్టీ కార్యక్రమాలు రానున్న కాలంలో ఉంటాయని ఆప్ చెబుతోంది. Also read: Telangana: సెక్రటేరియట్ వ్యవహారంలో కలగజేసుకోం: సుప్రీంకోర్టు

Trending News