విజయ్ మాల్యాకు జైలులో సదుపాయాలు కల్పిస్తాం: సిబిఐ

బ్రిటన్ నుండి విజయ్ మాల్యాను భారతదేశం పంపించాలంటే.. తనకు సకల సౌకర్యాలు కల్పించాలని ఆ దేశ కోర్టు తెలిపింది.

Last Updated : Aug 24, 2018, 09:40 PM IST
విజయ్ మాల్యాకు జైలులో సదుపాయాలు కల్పిస్తాం: సిబిఐ

బ్రిటన్ నుండి విజయ్ మాల్యాను భారతదేశం పంపించాలంటే.. తనకు సకల సౌకర్యాలు కల్పించాలని ఆ దేశ కోర్టు తెలిపింది. భారతీయ జైళ్లలో సరైన సదుపాయాలు ఉండవని.. వాటిని కల్పిస్తే తాను వెళ్లేందుకు సిద్ధమేనని మాల్యా కోరిన మీదట లండన్ కోర్టు ఆ విషయాన్ని సిబిఐకి తెలిపింది. భారతదేశంలో మాల్యాను ఎలాంటి జైలులో ఉంచాలని భావిస్తున్నారో.. ఆ జైలులో సకల సదుపాయాలు ఉండాలని.. వాటి వీడియోలను కోర్టుకి పంపించాలని కూడా తెలిపింది. ఈ క్రమంలో ప్రస్తుతం భారతదేశంలో సిబిఐ అధికారులు మాల్యాకు సకల సౌకర్యాలు కల్పిస్తామని అంటున్నారు.

మాల్యా ఉండబోయే జైలులో టెలివిజన్ సెట్‌తో పాటు మంచం, వ్యక్తిగత టాయిలెట్ ఉండేలా చూస్తామని కూడా తెలిపారు. ఆర్ధర్‌రోడ్‌లోని 12 బారక్‌లో అన్ని వసతులతో కూడిన గదిని మాల్యాకి సమకూరుస్తామని తెలియజేశారు. మాల్యాని ఎలాంటి ప్రదేశంలో ఉంచాలని భావిస్తున్నారో... ఆ ప్రదేశాన్ని వీడియో షూట్ చేసి.. ఎనిమిది నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీగా తయారుచేసి లండన్ కోర్టులో దాఖలు కూడా చేశారు.

భారతదేశంలో బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు టోపీ పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా.. ఈ సంవత్సరం బ్రిటన్ వెళ్లిపోయి అక్కడే బెయిల్ పొందారు. తాను మోసగాడిని కాదని.. తనపై వస్తున్న మనీ ల్యాండరింగ్ ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. అలాగే బ్యాంకులతో సెటిల్ చేసుకోవడానికి తాను సిద్ధంగానే ఉన్నానని కూడా తెలిపాడు. 

Trending News