Vice President: వెంకయ్య నాయుడు పది లక్షల విరాళం

శతాబ్దాల నాటి హిందువుల కల ఈ రోజు సాకారమయ్యింది. అయోధ్యలో రామ మందిర ( Ram Temple) నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని భారతదేశమంతా సోషల్ మీడియా, టీవీల ద్వారా వీక్షించింది. 

Last Updated : Aug 5, 2020, 05:45 PM IST
Vice President: వెంకయ్య నాయుడు పది లక్షల విరాళం

Venkaiah Naidu donates 10 lakhs: న్యూఢిల్లీ : శతాబ్దాల నాటి హిందువుల కల ఈ రోజు సాకారమయ్యింది. అయోధ్యలో రామ మందిర ( Ram Temple) నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని భారతదేశమంతా సోషల్ మీడియా, టీవీల ద్వారా వీక్షించింది. రామ మందిర ఆకాంక్ష నేరవేరుతున్న సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( M Venkaiah Naidu ) కూడా ఢిల్లీలోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి రామయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న కార్యక్రమాన్ని టీవీలో వీక్షించారు. Also read: Ram temple: రామ మందిరం కోసం 28 ఏళ్లుగా మరో శబరి ఉపవాసం

అయితే ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అయోధ్య ( Ayodhya ) లో రామ మందిర నిర్మాణానికి రూ.5లక్షలు, కోవిడ్-19 ( Covid-19 ) పై పోరాటానికి రూ.5లక్షలు విరాళం ప్రకటించారు. ఇదిలాఉంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తమ విరాళాన్ని ప్రకటించి రామునిపై భక్తిని చాటుకున్నారు. Also read: Ayodhya: ఘనంగా జరిగిన భూమిపూజ

Trending News