Uttarpradesh: భీం ఆర్మీ చీఫ్ ఆజాద్ కొత్త పార్టీ...

భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఉద్యమాల నుండి రాజకీయాల వైపు అడుగులు మొదలుపెట్టాడు. కాగా నేడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్సీ రామ్ జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రశేఖర్ ఆజాద్ "ఆజాద్ సమాజ్ పార్టీ"ని నోయిడాలోని సఫాయ్ గ్రామంలో ప్రారంభించారు.

Last Updated : Mar 16, 2020, 04:19 PM IST
Uttarpradesh: భీం ఆర్మీ చీఫ్ ఆజాద్ కొత్త పార్టీ...

లక్నో: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఉద్యమాల నుండి రాజకీయాల వైపు అడుగులు మొదలుపెట్టాడు. కాగా నేడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్సీ రామ్ జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రశేఖర్ ఆజాద్ "ఆజాద్ సమాజ్ పార్టీ"ని నోయిడాలోని సఫాయ్ గ్రామంలో ప్రారంభించారు.  

Read Also: శరీరంపై ఏయే రోజుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..

37 ఏళ్ల ఆజాద్ తన ఆదర్శ నాయకుడు కాన్సీరామ్ ఫోటోను తన ట్విట్టర్లో ప్రొఫైల్ పిక్ గా మార్చాడు. రెండు నీలిరంగు కుట్లు మధ్య తెల్లటి బ్యాండ్ కలిగిన పార్టీ జెండా ప్రారంభించాడు.

 

Read Also: శరీరంపై ఏయే రోజుల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..

మరోవైపు దేశవ్యాప్తంగా ఘనంగా మాన్యశ్రీ కాన్షిరం 86వ జయంతి నిర్వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, రాజనీతి పితామహులు మాన్యశ్రీ కాన్షీరామ్ గారి 86వ జయంతి కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. దీన్ని పురస్కరించుకొని పలువురు మాట్లాడుతూ.. అట్టడుగున ఉన్న ప్రజలు సింహాసనం వైపు ఎలా వెళ్లాలో చూపించిన మహాయోధుడు కాన్షిరాం అని స్మృతులను కొనియాడారు. స్మశానం నుండి ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలను సింహాసనం వైపు మార్గం చూపించిన మహా నాయకుడు కాన్షీరామ్ అని ఆయనను గుర్తు చేసుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News