PM Modi: కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

PM Modi in Kedarnath: ప్రముఖ కేదార్‌నాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సందర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి బద్రీనాథ్ వెళ్లనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 11:19 AM IST
PM Modi: కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

PM Modi in Kedarnath: ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయాన్ని (PM Modi Visits Kedarnath temple) దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి...పూజలు కూడా చేశారు. అనంతరం జగద్గురు ఆదిశంకరాచార్య సమాధిని కూడా సందర్శించారు. అక్కడ నుంచి బద్రీనాథ్‌కు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ చేరుకున్న మోదీకి ఆ రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్, సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘనస్వాగతం పలికారు. ప్రధాని టూర్ సందర్భంగా కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను క్వింటాళ్ల కొద్ది పూలతో అలంకరించారు. 

ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా.. వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి, కొన్ని కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. ఆయన పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రూ. 3400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అంతేకాకుండా 9.7 కి.మీ పొడవైన గౌరీకుండ్-కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్ట్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బద్రీనాథ్ చేరుకుని నదితీర వెంబడి అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకోనున్నారు మోదీ. అనంతరం అరైవల్ ప్లాజా, సరస్సుల సుందరీకరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు.

ప్రధానమంత్రి కేదార్‌నాథ్-బద్రీనాథ్ పర్యటన ఉత్తరాఖండ్ అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. ఈ ప్రదేశాలలో చేపట్టిన కనెక్టివిటీ ప్రాజెక్టులు మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలలో యాక్సెస్‌ను సులభతరం చేయడానికి మరియు  మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు గురువారం నరేంద్ర మోదీ, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మిషన్ లైఫ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. 

Also Read: Viral: యూపీలో దారుణం... ప్లేట్‌లెట్లకు బదులు ఫ్రూట్ జ్యూస్ ఎక్కించారు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News