డెహ్రాడూన్ ఎయిర్ పోర్ట్ పేరు మార్పుకు ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం

డెహ్రాడూన్ ఎయిర్ పోర్ట్‌కు వాజ్‌పేయి పేరు.. ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం!

Last Updated : Nov 25, 2018, 04:15 PM IST
డెహ్రాడూన్ ఎయిర్ పోర్ట్ పేరు మార్పుకు ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం

ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో ఉన్న విమానాశ్రయానికి ఉన్న పాత పేరు జాల్లిగ్రాంట్ ఎయిర్ పోర్టును మార్చి, దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పేరు పెట్టేందుకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న శీతాకాల సమావేశాల్లో శాసన సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం తీర్మానాన్ని పౌర విమానయాన శాఖకు పంపించనున్నట్టు ఆ రాష్ట్ర కేబినెట్ స్పష్టంచేసింది. వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలకు గౌరవార్థంగా డెహ్రాడూన్ ఎయిర్ పోర్టుకు ఆయన పేరు పెట్టాలని తీర్మానం చేసినట్టు కేబినెట్ తెలిపింది.

Trending News