Taliban Issue: తాలిబన్లపై ఉత్తరప్రదేశ్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Taliban Issue:ఆప్ఘన్‌లో తాలిబన్ల ప్రభుత్వంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఎంపీ తాలిబన్లకు మద్దతుగా వ్యాఖ్యలు చేసి సంచలనమయ్యారు. ఆయన వ్యాఖ్యలిప్పుడు వివాదాస్పదమవుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 18, 2021, 10:56 AM IST
Taliban Issue: తాలిబన్లపై ఉత్తరప్రదేశ్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Taliban Issue:ఆప్ఘన్‌లో తాలిబన్ల ప్రభుత్వంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఎంపీ తాలిబన్లకు మద్దతుగా వ్యాఖ్యలు చేసి సంచలనమయ్యారు. ఆయన వ్యాఖ్యలిప్పుడు వివాదాస్పదమవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar pradesh)సంభల్ నియోజకవర్గ ఎంపీ, సమాజ్‌వాది పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆఫ్ఘన్ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు(Talibans)స్వాధీనం చేసుకోవడాన్ని భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు. భారతీయుల పోరాటం, తాలిబన్ల పోరాటం దాదాపు సమానమేనని..స్వాతంత్య్ర పోరాటమేనని చెప్పారు. 

ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan)వారి అంతర్గత వ్యవహారమని చెబుతూనే..దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నారని..అనుకున్నది సాధించారని సంభల్ లోక్‌సభ ఎంపీ షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ చెప్పారు. అయితే ఎంపీ చేసిన వ్యాఖ్యలపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్(Yogi Adityanath) మండిపడ్డారు. సిగ్గులేకుండా తాలిబన్లను సమర్ధించడాన్ని విమర్శించారు. తాలిబన్లను సమర్ధించడమంటే..రాక్షసకాండకు మద్దతు పలికినట్టేనన్నారు. మానవత్వానికి మచ్చగా మారిన వారికి మద్దతుగా మాట్లాడటం మంచిది కాదన్నారు. 

Also read: Central government: న్యాయమూర్తులకు ఆ తరహా రక్షణ సాధ్యం కాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News