Uttar Pradesh: హాట్ హాట్‌గా యూపీ రాజకీయాలు, ప్రచారం ప్రారంభించేసిన ఒవైసీ

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో వాతావరణం వేడెక్కుతుంది. అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం అప్పుడే ప్రారంభించేశారు. మరోవైపు మాయావతి, అఖిలేష్ యాదవ్‌లను టార్గెట్ చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 9, 2021, 10:37 AM IST
  • ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అసదుద్దీన్ ఒవైసీ
  • అఖిలేష్ యాదవ్ , మాయావతి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించిన ఒవైసీ
  • ఎస్పీ, బీఎస్పీ కారణంగానే మోదీ రెండుసార్లు ప్రధాని అయ్యారంటూ విమర్శలు
 Uttar Pradesh: హాట్ హాట్‌గా యూపీ రాజకీయాలు, ప్రచారం ప్రారంభించేసిన ఒవైసీ

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో వాతావరణం వేడెక్కుతుంది. అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం అప్పుడే ప్రారంభించేశారు. మరోవైపు మాయావతి, అఖిలేష్ యాదవ్‌లను టార్గెట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు(UP Assembly Elections) సమీపిస్తున్న నేపధ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కువవుతున్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అప్పుడే యూపీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశారు. దాదాపు ఏడాది ముందే ఒవైసీ ప్రచారం ప్రారంభించడంపై చర్చ సాగుతోంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాద్ పార్టీలు లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు అసదుద్దీన్ ఒవైసీ. ఎస్పీ, బీఎస్పీల కారణంగానే నరేంద్ర మోదీ రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యారంటూ ఆరోపించారు. అఖిలేష్ యాదవ్, మాయావతిలపై(Mayawati) సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అసదుద్దీన్ కారణంగా తమ పార్టీ ఓట్లు చీలిపోతున్నాయని చెబుతూ ఓట్ స్పాయిలర్‌గా అభివర్ణించడంపై ఒవైసీ మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav), మాయావతి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం వల్ల బీజేపీ అభ్యర్ధుల ఓట్లు పోతున్నాయనే విమర్శలపై సమాధానమిచ్చారు. తమ పార్టీ ఓట్లు చీల్చితే..గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు ఎలా గెలిచారని ప్రశ్నిచారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం ఓట్లతో బీజేపీ గెలవలేదని గుర్తు చేశారు. ముస్లిం ప్రయోజనాల్ని కాపాడేందుకే దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఎంఐఎం(MIM) పోటీ చేస్తోందని చెప్పారు. 2019 ఎన్నికల్లో హైదరాబాద్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీహార్‌లోని కిషన్‌గంజ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిందన్నారు. మోదీ, అమిత్ షాలు హైదరాబాద్‌లో పలు పర్యటనలు చేసినప్పటికీ..బీజేపీ ఓడించగలిగామన్నారు. అఖిలేష్‌తో పొత్తు పెట్టుకుంటారా అనే ప్రశ్నకు దీటైన సమాధానమిచ్చారు. ఈ ప్రశ్న అఖిలేష్‌ను అడగమన్నారు. పొత్తుల విషయంలో చర్చంటూ జరిగితే అన్నివైపుల్నించి జరగాలని అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) గుర్తు చేశారు. యూపీలో ఉన్న ముస్లింలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. అధికారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం పొందినప్పుడే పరిస్థితులు మెరుగవుతాయన్నారు. గతంలో ఎస్పీ, బీఎస్పీలకు ఓట్లేసిన ముస్లింలు..తమ శక్తి ఎంటనేది చూపించాలని పిలుపునిచ్చారు.

Also read: Corona Vaccination Guidelines: కరోనా వ్యాక్సిన్ల మార్పిడిపై కేంద్రం తాజా మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News