Uttar Pradesh Lucknow Earthquake: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. శనివారం (ఆగస్టు 20) తెల్లవారుజామున 1.12 గం. సమయంలో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. లక్నోకి ఉత్తర-ఈశాన్య దిశగా 139 కి.మీ దూరంలో, భూమి లోపల 82 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం... లక్నోతో పాటు లఖీంపూర్ ఖేరీ, మరికొన్ని జిల్లాల్లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోనూ పలుచోట్ల భూమి కంపించింది. నేపాల్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. భూకంపం కారణంగా ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. పలువురు నెటిజన్లు భూకంపంపై ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. లక్నోలో భూకంపం సంభవించిందా అంటూ ఆరా తీశారు.
శుక్రవారం (ఆగస్టు 19) ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లలోనూ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. జమ్మూకశ్మీర్‌లో భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. మూడు రోజుల క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌లోనూ భూకంపం చోటు చేసుకుంది. ఏకంగా గంట వ్యవధిలో మూడుసార్లు అక్కడ భూమి కంపించింది. ఇటీవలి కాలంలో దేశంలో తరచూ భూకంప సంఘటనలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook