Rahul Gandhi Insulting Comments On Aishwara Rai: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. గత నెలలో జూన్ 22 న అయోధ్యలో భవ్యరామమందిరం వేడుకగా జరిగింది. వందల ఏళ్ల తర్వాత రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కలసాకారమైంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ రామమందిర ప్రారంభోత్సవం సందర్భంలో గురించి మాట్లాడుతూ.. రామ మందిరంలో 'ప్రాణ్‌ప్రతిష్ఠ' వేడుకను మీరు చూశారా?.. ఒక్క ఓబీసీ ముఖం ఉందా?.. అక్కడ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అంబానీ, అదానీలు, నరేంద్ర మోడీ ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు.
Congress Clown Prince @RahulGandhi now has a dangerous & creepy obsession with successful & self-made women.
Frustrated by constant rejections by Indians, Rahul Gandhi has sunk to a new low of demeaning India's Pride Aishwarya Rai.
A fourth-generation dynast, with zero… pic.twitter.com/6TA442wWTZ
— BJP Karnataka (@BJP4Karnataka) February 21, 2024
"టెలివిజన్ ఛానల్స్ ఐశ్వర్యరాయ్ డ్యాన్స్ మాత్రమే చూపిస్తాయి. అవి పేద ప్రజల గురించి ఏమీ చూపించవని రాహుల్ గాంధీ ప్రసంగంలో అన్నారు. ప్రస్తుతం ఇది రచ్చగా మారింది. దేశ జనాభాలో 73 శాతం ఉన్న ఓబీసీలు, దళితులు ఈవేడుకు దూరంగా ఉన్నారన్నారు. కానీ.. కోటీశ్వరులు, బాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ మహా వేడుకకు గైర్హాజరయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీని విమర్శించారు. 53 ఏళ్ల రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు రాజకీయంగాను, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోను తీవ్ర దుమారంగా మారాయి.
ఈ క్రమంలో.. శ్రీమతి మోహపాత్ర దీనిపౌ ఎక్స్ వేదికగా రాహుల్ పై సెటైర్ లు వేశారు. మై డియర్.. రాహుల్ జీ... ఎవరైనా మీ స్వంత తల్లి (సోనియా గాంధీ), సోదరి (ప్రియాంక గాంధీ)ని కించపరిచేలా మాట్లాడితే మీకు ఎలా ఉంటుది. ఒక్కసారి ఆలోచించండని చురకలు పెట్టింది. అదే విధంగా.. బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ చాలా అందంగా డాన్స్ చేస్తుందని గాయని తన పోస్ట్ లో కామెంట్ లు చేశారు. ఇదిలా ఉండగా రాహుల్ వ్యాఖ్యలపై.. బీజేపీ నేతలు కూడా మండిపడ్డారు. పవిత్రమైన రామజన్మభూమి వేడుకలు, నటి ఐశ్వర్యరాయ్ పై వ్యాఖ్యలు చేసి రాహుల్ మరింత దిగజారీపోయారని అన్నారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ హాజరు కాగా, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వారితో పాటు అయోధ్యకు వెళ్లలేదన్నారు. అక్కడి లేని వారి గురించి కూడా ఇలా వ్యాఖ్యలు చేయడం రాహుల్ దిగజారుడుతనమని బీజేపీ నేతలు విమర్శించారు. గతంలో ప్రపంచ సుందరిగా కిరిటం సాధించి, భారత గొప్పతనాన్ని శిఖరాలకు తీసుకెళ్లిన మహిళను పట్టుకుని, ఇలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
Read More: Rakul Preet Singh Wedding: డిఫరెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. తరలివచ్చిన బాలీవుడ్ సెలబ్రిటీస్
రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో అమితాబ్, ఐశ్వర్యల గురించి ప్రస్తావించిన వివిధ సందర్భాల క్లిప్‌లను బీజేపీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఇది కాస్త కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శలకు దారితీసింది. రాహుల్ గాంధీ "తోటి కన్నడిగను" అవమానించినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. "మీ బాస్ తోటి కన్నడిగను అవమానించడం కొనసాగిస్తున్నందున, మీరు మీ కన్నడ గర్వాన్ని నిలబెట్టుకుంటారా..?.. అలాంటి అగౌరవానికి వ్యతిరేకంగా మాట్లాడతారా లేదా మీ సీఎం కుర్చీని కాపాడుకోవడానికి మీరు మౌనంగా ఉంటారా?" అని సిద్ధరామయ్యను బీజేపీ ప్రశ్నించింది. ప్రస్తుతం దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook