Gyanvapi Masjid Issue: జ్ఞానవాపిపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ వివాదాస్పద వ్యాఖ్యలు

Gyanvapi Masjid Issue: ఉత్తరప్రదేశ్ జ్ఞానవాపి మసీదు వ్యవహారం మరోసారి వార్తలకెక్కుతోంది.  ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగీ చేసిన ఈ వ్యాఖ్యలిప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2023, 05:46 PM IST
Gyanvapi Masjid Issue: జ్ఞానవాపిపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ వివాదాస్పద వ్యాఖ్యలు

Gyanvapi Masjid Issue: ఉత్తరప్రదేశ్‌లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారం కోర్టులో విచారణలో ఉండగానే యూపీ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్ వివాదాన్ని మరింత రాజేశారు. జ్ఞానవాపిని మసీదు అని పిలవడమే వివాదమంటూ కొత్త వివాదానికి తెరతీశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు విషయంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయాలని వారణాసి కోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం సరిగ్గా సర్వే ప్రారంభించేరోజున సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో సర్వే నిలిచిపోయింది. మరోవైపు ఇదే అంశంపై అలహాబాదా హైకోర్టులో మసీదు కమటీ వేసిన పిటీషన్ విచారణలో ఉంది. ఈ పిటీషన్‌పై ఆగస్టు 3వ తేదీన తీర్పు వెలువడవచ్చు. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కొత్త వివాదాన్ని రేపేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. 

జ్ఞానవాపిని మసీదు అని పిలవడంలోనే వివాదముందని వ్యాఖ్యానించారు. మసీదు విషయంలో జరిగిన చారిత్రక తప్పిదానికి పరిష్కారాన్ని చూపించాల్సిన బాధ్యత ముస్లింలపై ఉందన్నారు యోగీ ఆదిత్యనాథ్. భగవంతుడు కళ్లు ఇచ్చినవాళ్లు..మసీదులోని త్రిశూలాన్ని చూడాలని, అది అక్కడ ఎందుకుందో ఆలోచించాలని సూచించారు. అక్కడే జ్యోతిర్లింగం, దేవతా మూర్తుల విగ్రహాలున్నాయని, అక్కడి గోడలు అరుస్తూ ఏవేవో మాట్లాడుతున్నాయని యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. జ్ఞానవాపిలో ఓ చారిత్రిక తప్పిదం జరిగిందని, ఈ తప్పిదానికి పరిష్కారం చూపేలా ముస్లిం సమాజం ప్రతిపాదన చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనమౌతున్నాయి.

మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. జ్ఞానవాపిలో సర్వేను వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ వేసిన పిటీషన్‌పై అలహాబాద్ హైకోర్టులో త్వరలో తీర్పు వెలువడనుందని..ఈ విషయె తెలిసికూడా యోగీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని చెప్పారు.

Also read: Manipur Violence: మణిపూర్‌పై మండిపడిన సుప్రీంకోర్టు, ప్రత్యేక సిట్ ఏర్పాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News