Civil Services Prelims Exam: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ప్రకటించిన UPSC

UPSC Civil Services Notification 2021 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షా తేదీని ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 11, 2021, 12:33 PM IST
Civil Services Prelims Exam: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ప్రకటించిన UPSC

UPSC Civil Services Prelims Exam 2021: దేశంలో సర్వోన్నత సర్వీసులు అయిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల తేదీలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌ 27న సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో యూపీఎస్సీ(UPSC) తెలిపింది.

ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో పూర్తి నోటిఫికేషన్ పొందవచ్చుని సూచించింది. అధికారిక వెబ్‌సైట్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. సీఎస్ఈ-2021, ఐఎఫ్‌వోఎస్ఈ-2021 పరీక్షలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Also Read: SBI: హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి శుభవార్త, అప్పటివరకూ ఆ ఫీజు లేదు

ప్రతి ఏడాది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్‌తో పాటు సీఎస్ఈ, ఐఎఫ్ఓలకు పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్ అనంతరం మెయిన్స్, ఆపై ఇంట్వ్యూలు నిర్వహించి ఆయా పోస్టులకు అభ్యర్థులకు ఎంపిక చేస్తుందని తెలిసిందే. 

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, భారీగా దిగొచ్చిన Silver Price

కాగా, జూన్ 27వ తేదీన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. గతేడాది చివరి ప్రయత్నం అయి ఉండి కరోనా నేపథ్యంలో పరీక్షకు హాజరుకాని గరిష్ట వయసు( Age Limit) మించిన వారికి మరో అవకాశం కల్పించడం లేదు. కేవలం నిర్ణీత వయసులో ఉన్న వారికి మాత్రమే ఈ ఏడాది మరో ప్రయత్నం చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News