హైదరాబాద్: అన్‌లాక్ 4 మార్గదర్శకాలులో భాగంగా ఇటీవలే మెట్రో రైలు సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం.. ఇవాళ అందుకు సంబంధించిన స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసిజర్ నియమావళిని విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి 12వ తేదీలోగా విడతల వారీగా గ్రేడెడ్ పద్ధతిలో దేశంలోని అన్ని మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) నేపథ్యంలో మెట్రో రైళ్లలో కొవిడ్-19 నియంత్రించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ మేరకు తాజా ఆదేశాలు జారీచేశారు. కేంద్రం సూచించిన Standard operating procedures (SOPs) నియమాలు ఇలా ఉన్నాయి. Also read : Unlock 4 Guidelines: హైదరాబాద్ మెట్రో రైలు పట్టాలెక్కే రోజు
- ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ ( Thermal screening ) నిర్వహించిన అనంతరం లక్షణాలు ( Asymptomatic passengers ) లేనివారినే మెట్రో రైలు స్టేషన్లోకి అనుమతించాలి.
- సోషల్ డిస్టన్సింగ్ ( Social distancing ) లక్ష్యం దెబ్బతినకుండా మెట్రో స్టేషన్ పరిసరాల్లో, మెట్రో రైలులో ( Metro rail ) మార్కింగ్ చేసిన గుర్తులపైనే నిలబడాల్సి ఉంటుంది.
- ప్రయాణికులతో పాటు మెట్రో రైలు సిబ్బంది మాస్కులు ధరించడం ( Mask wearing ) తప్పనిసరి. మాస్కులు లేకుండా వచ్చే వారు మెట్రో స్టేషన్స్‌లో మాస్కులు కొనుగోలు చేసేలా మాస్కులు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలి.
- ప్రయాణికులకు ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌పై ( Aarogya setu app ) అవగాహన కల్పిస్తూ ఆరోగ్య సేతు యాప్ వినియోగించేలా ప్రోత్సహించాలి.
- మెట్రో రైలు స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులకు ప్రవేశద్వారం వద్దే శానిటైజర్ ( Sanitizers ) అందుబాటులో ఉండాలి.
- మెట్రో రైలుతో పాటు స్టేషన్‌లోని కౌంటర్స్, టాయిలెట్స్, లిఫ్ట్ వంటి అన్ని పరిసరాలను నిర్వాహకులు ఎప్పటికప్పుడు శానిటైజ్ ( Sanitization ) చేయాలి.
- స్మార్డ్ కార్డు / క్యాష్‌లెస్ / ఆన్లైన్ టికెట్ ( smart card / cashless / Online transactions ) కొనుగోలు పద్ధతులను ప్రోత్సహించాలి. టోకెన్స్ / పేపర్ స్లిప్స్ / టికెట్స్‌ను శానిటైజ్ చేయాలి.
- రైలు స్టేషన్లో వచ్చి ఆగినప్పుడు రైలు ఎక్కి, దిగే ప్రయాణికుల మధ్య తోపులాట లేకుండా తగినంత సమయం రైలు ఆగేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. Also read : Unlock 4 Guidelines: సిటీ బస్సులు పరిస్థితేంటి ?
హైదరాబాద్, ఢిల్లీ, నొయిడా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, జైపూర్, కోల్‌కతా, గుజరాత్, లక్నో మెట్రో సేవల విషయంలో కేంద్రం విధించిన పై నిబంధనల మేరకే వారివారి సొంత నిబంధనలను రూపొందించుకున్నట్టు కేంద్రం వెల్లడించింది.
మహారాష్ట్రలో కొవిడ్-19 ( COVID-19 in Maharashtra ) విజృంభిస్తున్నందున అక్కడి మెట్రో సేవలు అక్టోబర్ 20 తర్వాతే అందుబాటులోకి రానున్నట్టు కేంద్రం తెలిపింది. Also read : TS EAMCET: రెండు సెషన్స్‌లో ఎంసెట్ పరీక్ష.. రేపటి నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు