Liquid DAP: రైతులకు గుడ్‌న్యూస్.. లిక్విడ్ డీఏపీ వచ్చేసింది.. ధర ఎంతంటే..?

Liquid Nano DAP Price: రైతులకు శుభవార్త. లిక్విడ్ నానో డీఏపీ అందుబాటుకి వచ్చింది. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రస్తుతం వాడుతున్న 50 కేజీల బస్తా డీఏపీకి సమానంగా 500 ఎంఎల్ బాటిల్‌ను తయారు చేశారు. ఈ బాటిల్ ధర ఎంతంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 27, 2023, 11:39 AM IST
Liquid DAP: రైతులకు గుడ్‌న్యూస్.. లిక్విడ్ డీఏపీ వచ్చేసింది.. ధర ఎంతంటే..?

Liquid Nano DAP Price: ప్రపంచంలోనే మొట్టమొదటి లిక్విడ్ నానో డీఏపీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంచ్ చేశారు. లిక్విడ్ డీఏపీ అందుబాటులోకి రావడంతో ఇతరు దేశాల నుంచి ఎరువుల దిగుమతులు తగ్గనున్నాయి. అంతేకాకుండా దేశాన్ని స్థిరమైన వ్యవసాయం వైపు తీసుకెళ్తుంది. ఇన్‌పుట్ ధరను రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నానో డీఏపీని ప్రారంభించింది. దీని వల్ల రానున్న కాలంలో వ్యవసాయ ఖర్చు 20 శాతం తగ్గుతుంది. లిక్విడ్ నానో డి అమ్మోనియం ఫాస్ఫేట్ (డీఏపీ), లిక్విడ్ నానో యూరియా వినియోగాన్ని పెంచాలని అమిత్ షా రైతులకు విజ్ఞప్తి చేశారు. లిక్విడ్ డీఏపీ వాడకంతో ఎరువుల ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తుందన్నారు. ఐఎఫ్‌ఎఫ్‌సీఓ నానో లిక్విడ్ డీఏపీ ఎరువులు అమ్మకానికి 500 ఎంఎల్ సీసాలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ద్రవరూపంలో లభించే డీఏపీ వ్యవసాయోత్పత్తి నాణ్యత, పరిమాణాన్ని పెంచడంలో దోహదపడుతుందన్నారు.  

500 ఎంఎల్ బాటిల్ ధర రూ.600గా నిర్ణయించారు. ప్రస్తుతం వాడుతున్న డీఏపీ కంటే లిక్విడ్ డీఏపీ తక్కువ ధరకు లభిస్తుంది. ప్రస్తుతం 50 కిలోల బ్యాగ్ ధర రూ.1,350గా ఉంది. లిక్విడ్ డీఏపీ వాడకంతో నేల సంరక్షణ, అధిక పంట దిగుబడి ఉంటుంది. అంతేకాకుండా డీఏపీ బ్యాగ్‌ల వాడకంతో రవాణాకు కూడా కష్టంగా ఉంది. దిగుమతి, ఎగుమతి కూడా ఎక్కువ ఖర్చు అవుతోంది. లిక్విడ్ డీఏపీతో ఆ భారం అంతా తగ్గిపోనుంది. 500 ఎంఎల్ ఒక బాటిల్ 50 కేజీల బస్తాను రిప్లేస్ చేస్తుంది. నానో డీఏపీ తయారీ యూనిట్లు గుజరాత్‌లోని కలోల్‌లో, ఒడిషాలోని పరాదీప్‌లో స్థాపించారు. 2022-23 ఏడాదిలో ఎరువుల సబ్సిడీ బిల్లు రూ.2.25 లక్షల కోట్లుగా ఉంది. నానో డీఏపీ వాడకంతో ఇక నుంచి 20 శాతం ఖర్చు తగ్గనుంది. 

నానో యూరియా, నానో డీఏపీకి 20 ఏళ్లుగా ఇఫ్కో పేటెంట్‌ను పొందిందని అమిత్ షా వెల్లడించారు. లిక్విడ్ డీఏపీని ఉపయోగించడం వల్ల ఉత్పత్తి నాణ్యత, పరిమాణం రెండూ పెరుగుతాయన్నారు. రైతులు తమ భూమిలో వానపాముల సంఖ్యను పెంచవచ్చని.. ఉత్పత్తి, ఆదాయాన్ని తగ్గించకుండా సహజ వ్యవసాయం వైపు వెళ్లడం ద్వారా నేలను సంరక్షించడంలో కూడా ఇది సహాయపడుతుందన్నారు. రసాయన ఎరువుల వాడకంతో భారతీయుల ఆరోగ్యానికి ముప్పును తగ్గిస్తుందన్నారు. రైతులు లిక్విడ్ డీఏపీనే వినియోగించాలని కోరారు. 

కలోల్ ప్లాంట్‌లో 25 లక్షల టన్నుల డీఏపీకి సమానమైన నానో డీఏపీ లిక్విడ్ 50 మిలియన్ బాటిళ్లను తయారు చేయనున్నారు. నానో డీఏపీ ఒక సీసాలో 8 శాతం నైట్రోజన్, 16 శాతం భాస్వరం ఉంటుంది. ఇది ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న డీఏపీ 50 కిలోల బ్యాగ్‌కి సమానం. రైతుల ఆదాయాన్ని పెంచి వారికి మంచి భవిష్యత్‌ను అందించాలనే లక్ష్యంతో నానో డీఏపీని రూపొందించినట్లు ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ సంఘాని తెలిపారు. 

Also Read: Mother Kills Three Daughters: మనసెలా వచ్చిందమ్మా.. ముగ్గురు కూతుళ్లను బావిలోకి తోసి హత్య చేసిన తల్లి  

2025-26 వరకు 18 కోట్ల నానో డీఏపీ బాటిళ్ల ఉత్పత్తి 90 లక్షల టన్నుల సాంప్రదాయ డీఏపీ స్థానంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2021-22లో 91.3 లక్షల టన్నుల యూరియా, 54.6 లక్షల టన్నుల డీఏపీ, 24.6 లక్షల టన్నుల MoP (మ్యూరేట్ ఆఫ్ పొటాష్), 11.7 లక్షల టన్నుల ఎన్‌పీకే ఎరువులను మనదేశం దిగుమతి చేసుకుంది. నానో వేరియంట్‌ల అప్లికేషన్ గ్రాన్యులర్ యూరియా వినియోగాన్ని సుమారు 14 శాతం, డీఏపీని మొదట్లో 6 శాతం తరువాత 20 శాతం తగ్గించడంలో సహాయ పడనుంది.

Also Read: IPL 2023 Points Table: తలైవా మ్యాజిక్.. టాప్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. ఎస్ఆర్‌హెచ్ పరిస్థితి ఇలా..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News