Union Budget 2022: కేంద్ర బడ్దెట్ మళ్లీ వచ్చేస్తోంది. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ మరి కాస్సేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. మరి 8 ఏళ్లుగా సామాన్యుడు దేనికోసం నిరీక్షిస్తున్నాడో అది ఈసారి ఉంటుందా..లేదా. ( Common man expectations on union budget 2022, Income tax limit and Details)
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా కేంద్ర ఆర్ధిక బడ్జెట్ (Union Budget 2022) ఇవాళ పార్లమెంట్లో రానుంది. మోదీ రెండవదఫా పాలనలో ఇది నాలుగవ బడ్జెట్. మొత్తం దేశం బడ్జెట్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కరోనా థర్డ్‌వేవ్, అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో బడ్జెట్ ఉండబోతోంది. ఈ పరిస్థితుల్లో సామాన్య పౌరుడికి ఈ బడ్జెట్‌పై చాలా ఆశలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈ బడ్జెట్లో చాలావరకు సానుకూలాంశాలు ఉండవచ్చు. ముఖ్యంగా ఆ రాష్ట్రాలకు.
2022 కేంద్ర బడ్జెట్‌పై వ్యాపారస్థులు కూడా చాలా ఆశలే పెట్టుకున్నారు. అటు సామాన్య పౌరుడికి పెరుగుతున్న ధరల్నించి ఉపశమనం కల్పించాలనే ఆశ ఉంది. ఉద్యోగస్థుడికి ఆదాయపు పన్నులో మినహాయింపుపై ఆశ ఉంది. అయితే మోదీ ప్రభుత్వం చాలాసార్లు తన నిర్ణయాలతో ప్రజల్ని ఆశ్చర్యపర్చింది. ఈసారి బడ్జెట్లో ట్యాక్స్ స్లాబ్‌లో మార్పులు తీసుకొచ్చి ట్యాక్స్ పేయర్స్‌కు ఉపశమనం కల్పించవచ్చని తెలుస్తోంది.
8 ఏళ్ల క్రితం లభించిన ఇన్‌కంటాక్స్ మినహాయింపు
సామాన్య పౌరుడికి ఇవాళ్టి నుంచి 8 ఏళ్ల క్రితం ఆదాయపు పన్నులో ఉపశమనం లభించింది. 2014లో మోదీ ప్రభుత్వం (Modi Government) ఆదాయపు పన్ను పరిధిని 2 లక్షల్నించి 2.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అటు 60-80 ఏళ్ల వయస్సున్నవారికి మాత్రం ట్యాక్స్ పరిధిని 2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచింది. ఈసారి బడ్జెట్లో ట్యాక్స్ లిమిట్‌ను 2.5 లక్షల కంటే ఇంకా పెంచవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే చాలాకాలంగా సామాన్య, మధ్య తరగతి పౌరుడు ఇన్‌కంటాక్స్ పరిధి (Incometax)పెంచాలని గత 8 ఏళ్లుగా కోరుకుంటున్నాడు. అంటే 8 ఏళ్ల నుంచి ఉన్న సుదీర్ఘ నిరీక్షణ ఇది. ఈ నిరీక్షణకు ఇవాళ తెరపడే అవకాశాలున్నాయని సమాచారం. ఇన్‌కంటాక్స్ పరిధిని 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకూ పెంచవచ్చని తెలుస్తోంది. అటు వృద్ధులకు మాత్రం 3 లక్షల నుంచి 3.5 లక్షలకు పెంచే అవకాశాలున్నాయి.
Also read: Union Budget Key Points: కేంద్ర బడ్జెట్ అంటే ఏమిటి, బడ్జెట్లో కీలకమైన పది అంశాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook