Academic Year: దేశంలో కొత్త విద్యా సంవత్సరంపై నిర్ణయం వెలువడింది. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వెల్లడించింది.
కరోనా సంక్షోభం(Corona Crisis) కారణంగా 2020 నుంచి విద్యాసంవత్సరానికి విఘాతం కలుగుతోంది. సమయానికి పరీక్షలు జరగకపోవడం, చాలా రాష్ట్రాల్లో పరీక్షలు రద్దవడం లేదా వాయిదా పడటం, కళాశాలలు, స్కూళ్లు మూసివేయడం వంటి కారణాలతో విద్యా సంవత్సరం ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కళాశాలల్లో నూతన విద్యా సంవత్సరం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుందని యూజీసీ ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్(Admissions) ప్రక్రియ సెప్టెంబర్ 30కు పూర్తవుతుందని యూజీసీ తెలిపింది. సీబీఎస్ఈ ఐసీఎస్ఈ, వివిధ రాష్ట్రాల బోర్డుల ఫలితాలు వెల్లడైన తరువాతే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల అడ్మషన్ ప్రక్రియ ప్రారంభించాలని వర్శిటీలు, కళాశాలల్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా అన్ని ఫలితాలు జూలై 31లోగా వచ్చే అవకాశాలున్నాయి.
ఒకవేళ ఎక్కడైనా ఫలితాల వెల్లడిలో ఆలస్యమైతే కొత్త అకడమిక్ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కానుందని యూజీసీ(UGC)పేర్కొంది. అప్పటి పరిస్థితుల్ని బట్టి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ క్లాసులు, పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఒకవేళ ఎవరైనా విద్యార్ధి అడ్మిషన్ రద్దైనా లేదా మరో చోటికి మారినా చెల్లించిన ఫీజుల్ని పూర్తిగా వాపసు చేయాలని కళాశాలలు, యూనివర్శిటీల్ని ఆదేశించింది. డిగ్రీ చివరి సంవత్సరం ఫైనల్,సెమిస్టర్ పరీక్షల్ని ఆగస్టు 31లోగా పూర్తి చేయాల్సి ఉంది.
Also read: Covid19 Vaccine: భారీగా వ్యాక్సిన్ కొనుగోలు, 2-3 నెలల్లో మరో 66 కోట్ల వ్యాక్సిన్ డోసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Apple Link - https://apple.co/3loQYe
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook