పెద్దల సభలో త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందేనా ?

అధికార పార్టీకి కీలకమైన త్రిపుల్ తలాక్ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారు.

Last Updated : Jan 2, 2018, 04:26 PM IST
పెద్దల సభలో త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందేనా ?

అధికార పార్టీకి కీలకమైన త్రిపుల్ తలాక్ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యులు అందరూ జనవరి 2, 3 తేదీలలో తప్పనిసరిగా సభకు హాజరు కావాల్సిందిగా కోరుతూ బీజేపీ విప్ జారీ చేసింది. అయితే, ఈ బిల్లు రేపటి వరకు ఆలస్యమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. గత వారమే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఇక ఇప్పుడు పెద్దల సభలో ఆమోదం పొందాల్సి వుంది. 

ఇదిలావుంటే, ఈరోజు బిల్లు సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాజ్యసభ ప్రధాన ప్రతిపక్ష నేత అయిన గులాం నబీ ఆజాద్ ఇవాళ ఉదయమే పార్లమెంట్‌లోని తన చాంబర్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు సభలో సభ్యత్వం కలిగి వున్న ఇతర పార్టీల నేతలని సైతం గులాంనబీ ఆజాద్ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులో కొన్ని సవరణలకి పట్టుపట్టే అవకాశం వుందని తెలుస్తోంది.

Trending News