బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్లో మంగళవారం పెరిగిన బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. జ్యువెలర్ల వద్ద విక్రయాలు తగ్గడం, దేశీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది. ధరలు తగ్గడంతో నేడు బంగారు, వెండి కొనుగోళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్లో మార్చి 18న (బుధవారం) బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల ధర రూ.920 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్లో రూ.42,300కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.920 తగ్గడంతో మరోసారి నలభై వేలకు కిందకి దిగొచ్చింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.38,700కి క్షీణించింది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.900 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.40,750 అయింది. కాగా, 22 క్యారెట్ల బంగారం సైతం ధర రూ.900 దిగొచ్చింది. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.39,550కి క్షీణించింది.
బంగారంలా తగ్గిన వెండి
బంగారం ధరలు తగ్గగా వెండి సైతం పసిడి దారిలోనే పయనించింది. బులియన్ మార్కెట్లో బుధవారం వెండి కేజీ ధర రికార్డు స్థాయిలో రూ.6,280 తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.41,780కు క్షీణించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.41,780కి దిగొచ్చింది.
See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు
ఏపీలోనూ తగ్గిన బంగారం ధరలు (24 Carat Gold Rate in Vijayawada and Visakhapatnam)
ఏపీలోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.920 మేర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,300కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర సైతం అంతే తగ్గడంతో 10గ్రాముల ధర రూ.38,700కు క్షీణించింది.