Gold Rate Today: భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today In Hyderabad | బంగారం, వెండి ధరలు పెరుగుల, తగ్గుదలపై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ముడిపడి ఉంటాయి. డాలర్ మారకం విలువ, ముడి చమురు నిల్వల ఎగుమతులు, దిగుమతులు సైతం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.

Last Updated : Sep 24, 2020, 07:26 AM IST
Gold Rate Today: భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడోరోజు ధరలు తగ్గాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా ధర క్షీణించింది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.760 మేర భారీగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,470 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.700 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,100కి పడిపోయింది. 

తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) మూడోరోజు దిగొచ్చాయి. తాజాగా రూ.540 మేర భారీగా ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,460కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.500 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,000 అయింది.

వెండి ధర (Silver Rate in India) వరుసగా నాలుగోరోజు భారీగా పతనమైంది. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.1,600 మేర తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.59,000కి క్షీణించింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది. 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News