Rafale: ఇండియాకు చేరుకున్న మరో మూడు రఫేల్ యుద్ద విమానాలు

భారతదేశ అమ్ములపొదిలో దశలవారీగా రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరుతున్నాయి. తొలి విడతలో 5 రఫేల్ విమానాలు చేరుకోగా..ఇప్పుడు మరో 3 విమానాలు వచ్చి చేరాయి. 

Last Updated : Nov 4, 2020, 10:47 PM IST
Rafale: ఇండియాకు చేరుకున్న మరో మూడు రఫేల్ యుద్ద విమానాలు

భారతదేశ అమ్ములపొదిలో దశలవారీగా రఫేల్ యుద్ధ విమానాలు ( Rafale Flights ) వచ్చి చేరుతున్నాయి. తొలి విడతలో 5 రఫేల్ విమానాలు ( 5 Rafale flights ) చేరుకోగా..ఇప్పుడు మరో 3 విమానాలు వచ్చి చేరాయి. 

ఫ్రాన్స్ ( France ) నుంచి భారతదేశం రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత వైమానిక దళానికి ( Indian Airforce ) ఆయువుపట్టుగా భావిస్తున్న రఫేల్ విమానాల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తోంది ఇండియా. కొద్దిరోజుల క్రితమే తొలివిడతలో భాగంగా 5 రఫేల్ యుద్ధ విమానాలు ఇండియాలోని అంబాలా ఎయిర్ బేస్ కు చేరాయి. 

ఇప్పుడు మరో 3 యుద్ధవిమానాలు ఫ్రాన్స్ నుంచి అంబాలాకు వచ్చాయి. రాత్రి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అంబాలా ఎయిర్ బేస్ ( Ambala Airbase ) పై ఈ 3 రఫేల్ యుద్ధవిమానాలు ల్యాండ్ అయ్యాయి. ఈ సందర్బంగా ఎయిర్ బేస్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి అంబాలాకు చేరాయి.

ఏడు వేల కిలోమీట‌ర్ల సుదీర్ఘ దూరం ప్ర‌యాణించిన రఫేల్ విమానాలు హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ పై సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన ద‌సాల్డ్ కంపెనీ త‌యారు చేసిన 36 యుద్ధ విమానాలను భార‌త్ కొనుగోలుచేసింది. 60 వేల కోట్ల‌తో భారీ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో 30 రఫేల్ యుద్ధవిమానాలు, ఆరు ట్రైనీ విమానాలున్నాయి. రెండుదశల్లో ఇప్పటివరకూ 8 విమానాలు ఇండియాకు చేరాయి. రఫేల్ యుద్ధవిమానాలతో భారత రక్షణ రంగం మరింతగా బలోపేతమైంది. Also read: Delhi Airport: ఉగ్రవాద హెచ్చరిక..భారీ భద్రత

Trending News