Chatrapati Shivaji Statue: దేశవ్యాప్తంగా శివాజీ మహారాజ్ జయతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. అనేక చోట్ల యువకులు బైక్ లు, కార్లతో ర్యాలీలను నిర్వహించారు. మన దేశాన్ని , మోఘల్స్ కు వ్యతిరేకంగా పోరాడి కాపాడారు. అప్పట్లో అమాయకులను మతం మార్పిడి చేసుకోకుంటే ఊచకోత కోసేశారు. అంతే కాకుండా.. హిందూ దేవాలయాలపై దాడులు నిర్వహించి, ధ్వంసం చేసేవారు. ఇలాంటి అనేక ఘటనలను ఛత్రపతి శివాజీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చే దిశగా నడిపించారు.
Read More: Suriya: కష్టాల్లోపడిన సూర్య, విక్రమ్.. తమిళ హీరోల పాన్ఇండియా ప్రాజెక్టులకు తప్పని తిప్పలు
ఇదిలా ఉండగా.. గోవాలోని మార్గోవో పట్టణంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మరాఠా చక్రవర్తి యొక్క 394వ జయంతిని సూచిస్తుంది మరియు దీనిని జరుపుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతాయి. మార్గోవ్ సమీపంలోని ఒక గ్రామంలో కొందరు వ్యక్తులు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టించడం కోసం ప్రయత్నించారు దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటును.. మరో వర్గం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈక్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి, తోపులాట వరకు వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అక్కడ.. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో తమ లాఠీలకు పని చెప్పి ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. కాగా, గ్రామాన్ని సందర్శించిన గోవా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సుభాష్ ఫాల్ దేశాయ్, విగ్రహం ప్రైవేట్ భూమిలో ఏర్పాటు చేయబడిందని, స్థానిక పంచాయతీ నుండి అన్ని అనుమతులు పొందామని, డిప్యూటీ కలెక్టర్‌కు సమాచారం అందించామని చెప్పారు.
“ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. కొన్ని రాజకీయ శక్తులు విగ్రహ ప్రతిష్ఠాపనకు వ్యతిరేకంగా స్థానికులను రెచ్చగొడుతున్నాయని ఆయన అన్నారు. సోమవారం X వేదికగా , స్థానిక బిజెపి నాయకుడు సావియో రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. “మన మాతృభూమిని రక్షించడంలో ఛత్రపతి శివాజీ చేసిన కృషికి ఒక భారతీయ క్రైస్తవుడిగా నాకు అత్యంత గౌరవం ఉంది.
Read More: Rice Idli Recipe: ఎప్పుడైనా రైస్ ఇడ్లీ తిన్నారా? ఇలా సులభంగా రెడీ చేసుకోండి!
గోవాలో కొందరు మన మాతృభూమి కోసం ఆయన చేసిన త్యాగాలను తమ మత రాజకీయాలు ఆడేందుకు వివాదాస్పదంగా భావించడం నాకు నిరాశ కలిగించిందన్నారు. శివాజీ ఒక హార్డ్ కోర్ జాతీయవాది. అతని అపారమైన శౌర్యం, భారత మాత పట్ల భక్తి కారణంగా ప్రతి భారతీయుడు తప్పనిసరిగా అతని నుండి ప్రేరణ పొందాలని రోడ్రిగ్స్ అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook