తెలంగాణ ఎన్నికలు: పెరిగిన రాజా సింగ్ ఆస్తుల శాతం తెలిస్తే షాక్..

తెలంగాణ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆస్తులు గత ఎన్నికలతో పోల్చుకుంటే 14,107 శాతం పెరిగిన్నట్లు ఆయన సమర్పించిన అఫడివిట్ ద్వారా తెలుస్తోంది. 

Last Updated : Nov 20, 2018, 01:33 PM IST
తెలంగాణ ఎన్నికలు: పెరిగిన రాజా సింగ్ ఆస్తుల శాతం తెలిస్తే షాక్..

తెలంగాణ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీజేపీ నేత రాజా సింగ్ ఆస్తులు గత ఎన్నికలతో పోల్చుకుంటే 14,107 శాతం పెరిగిన్నట్లు ఆయన సమర్పించిన అఫడివిట్ ద్వారా తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. గత ఎన్నికల్లో ఆయన ఈసీకి సమర్పించిన పత్రాలలో తన ఆస్తుల విలువను రూ.2.02 లక్షలుగా పేర్కొనగా.. ఈసారి సమర్పించిన పత్రాలలో ఆస్తుల విలువను మాత్రం కోట్లలో చూపించారు. తన ఆస్తుల విలువను రూ.2.87 కోట్లగా పేర్కొన్నారు.  తన చేతిలో ఉన్న మొత్తం, బ్యాంకు సేవింగ్స్, వాహనాలు, జ్యుయలరీ మొత్తం విలువను రూ.87.5 లక్షలుగా పేర్కొన్నారు.

అలాగే హరిదాస్ మార్కెట్టు ప్రాంతంలోని తన కమర్షియల్ బిల్డింగ్ విలువను రూ.2.05 కోట్లుగా చూపించారు. అదే విధంగా వివిధ బ్యాంకుల నుండి తాను తీసుకున్న రుణాలను రూ.1.83 కోట్లుగా ఆయన చూపించారు. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈ లెక్కల ద్వారా తేలిన అంశం ప్రకారం రాజా సింగ్ ఆస్తుల విలువ 14,107 శాతం పెరిగిందని తెలుస్తోంది. 

అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తమ ఆస్తుల విలువను భారీగా పెంచుకున్న నాయకులలో రాజా సింగ్ తర్వాతి స్థానంలో మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఉన్నారు. గత సంవత్సరం ఆయన ఎన్నికలప్పుడు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువను రూ.3.9 కోట్లుగా చూపించగా.. ఈ సంవత్సరం ఆయన తన ఆస్తుల విలువ 50 శాతం వరకు పెరిగిందని తెలుస్తోంది. ఈయన తర్వాతి స్థానంలో దానం నాగేందర్ ఉన్నారు.  గత ఎన్నికలప్పుడు ఆయన తన ఆస్తి వివరాలను రూ.2.5 కోట్లుగా చూపించగా.. ప్రస్తుతం తన ఆస్తి విలువను రూ.22 కోట్లుగా పేర్కొన్నారు.

Trending News