Devi Awards 2023: 'అదానీ’ స్పాన్సర్ అయితే.. అవార్డు నాకు వద్దు..!

Devi Awards: ప్రముఖ అంగ్ల పత్రిక న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రతి ఏటా దేవి అవార్డులను ఇస్తుంది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలను ప్రధానం చేస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 08:48 AM IST
Devi Awards 2023: 'అదానీ’ స్పాన్సర్ అయితే.. అవార్డు నాకు వద్దు..!

Dalit poet Sukirtharani-Devi Awards: అదానీ గ్రూప్ వివాదం ఇప్పుడు కళారంగాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. అదానీ స్పాన్సర్ అని తెలిసి.. అవార్డు తీసుకోవడానిని నిరాకరించింది ఓ కవయిత్రి. ప్రముఖ అంగ్ల పత్రిక న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ దేశవ్యాప్తంగా పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ఏటా దేవి పురస్కారాలను ఇస్తుంది. ఈ సంవత్సరం ఈ అవార్డులు 12 మంది ఎంపిక చేసింది. అలా ఎంపికైన వారిలో ఒకరు తమిళ రచయిత్రి సుకీర్తరాణి. ఈమె కవయిత్రే కాకుండా టీచర్, సామాజిక కార్యకర్త కూడా. ఈమె దళిత సాహిత్యంపై ఎన్నో రచనలు చేసి గుర్తింపు పొందారు. ఈమె రచనలు పలు భాషల్లోకి అనువాదమయ్యాయి.

దేవి అవార్డుల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ హాజరై విజేతలకు అవార్డులు బహుకరించారు. అయితే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అదానీ ప్రధాన స్పాన్సర్‌ అని తెలిసి ఆ పురస్కారాన్ని తిరస్కరించారు సుకీర్తరాణి. ఆ ఈవెంట్ కు కూడా ఆమె హాజరుకాలేదు. ఈమె స్వస్థలం తమిళనాడులలో రాణిపేట జిల్లా లాలాపేట. 25 ఏళ్లుగా ఆమె మహిళా హక్కులు, దళితులు గురించి రచనలు చేస్తున్నారు. ఈమె సుకీర్త కైపత్రి యెన్ కనవు కేల్, ఈరవు మిరుగం, కామత్తిపూ, తీందపడతా ముత్తం, అవలై భాషిపెయర్తాల్, ఇప్పడిక్కు ఏవల్ అనే ఆరు పుస్తకాలను రచించారు. ఇటీవల అదానీ గ్రూప్‌ అక్రమాల్ని హిండెన్‌బర్గ్‌ నివేదిక బయటపెట్టిన సంగతి తెలిసిందే.

Also read: AP Governor: ఏపీ గవర్నర్ నియామకంపై వెల్లువెత్తుతున్న విమర్శలు, జైరాం రమేశ్ తీవ్ర ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News